బన్నీ- సుక్కూల ‘పుష్ప’ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ బాటలోనే..!

‘ఆర్. ఆర్.ఆర్’ నుండీ విడుదలైన ‘దోస్తీ’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇదే పాటని మిగిలిన భాషల్లో రకరకాల పేర్లతో కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ పాట పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.దర్శకుడు రాజమౌళి విజన్,ప్లానింగ్ ఏంటన్నది ఈ ఒక్క పాటతో ప్రూవ్ చేసాడు. ఇన్నేళ్ల ప్రేక్షకుల ఎదురుచూపులు వేస్ట్ కాదని.. ఇది ‘వర్త్ వెయిట్’ అని చెప్పకనే చెప్పాడు. మొత్తానికి మొదటి పాటతో ‘ఆర్.ఆర్.ఆర్’ సెన్సేషన్ మొదలైంది.

ఇప్పుడు ఇదే బాటలో ‘పుష్ప’ టీం కూడా నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ వారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. నిజానికి ‘పుష్ప’ ఆగష్ట్ 13న విడుదల చేస్తున్నట్టు.. ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది. కాబట్టి ఆగష్ట్ 13న విడుదల చేయలేని పరిస్థితి.

దాంతో అదే రోజున ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తరహాలోనే ఫస్ట్ సింగిల్ ను 5 భాషల్లో రిలీజ్ చేయడానికి ‘పుష్ప’ టీం రెడీ అయ్యింది. సుక్కూ-దేవి ది ఆల్ టైం చార్ట్ బస్టర్ కాంబో కాబట్టి.. అందరిలోనూ ఆసక్తి పెరిగింది.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus