Ram Charan, Rajkumar Hirani: చరణ్‌ బాలీవుడ్‌ టూర్‌లో మరో పుకారు… ఆ సినిమా వార్త నిజమేనా?

టాలీవుడ్‌ హీరో ఎవరైనా ముంబయి వెళ్లి ఓ రెండు రోజులు ఉండటం ఆలస్యం… ‘బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌తో టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా?’ అంటూ ఓ పుకారు బయటకొచ్చేస్తోంది. ఆ హీరో సొంత పని మీద వెళ్లినా, యాడ్‌ షూటింగ్‌ కోసం వెళ్లినా.. ఇలా ఏదైనా పుకారు మాత్రం సినిమా అనే వస్తోంది. అయితే ఒకరిద్దరి విషయంలో ఆ పుకార్లు తర్వాత వార్తలై నిజమైపోయాయి. తాజాగా ఈ పుకారు రామ్‌చరణ్‌ గురించి మొదలైంది.

ఇటీవల ఓ పని మీద రామ్‌చరణ్‌ ముంబయి వెళ్లాడు. అక్కడ ధోనీతో కలసి ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడని సమాచారం. ప్రపంచకప్‌ సందర్భంగా ఆ యాడ్‌ బయటకు వస్తుందని అంటున్నారు. ఆ విషయం ఇంకా క్లారిటీ లేదు. అయితే ధోనీతో చరణ్‌ సినిమా అంటూ ఓ పుకారు వండి, వార్చేశారు. ఇప్పుడు ఆ విషయం పక్కకు పోయింది. మరో కొత్త పుకారుగా రామ్‌చరణ్‌ – రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాను బయటకు తీసుకొచ్చారు.

బాలీవుడ్‌లో రాజ్‌ కుమార్‌ హిరానీ అపజయమెరుగని దర్శకుడు. 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పుడు ఆయన చేస్తున్నది ఆరో సినిమా. ఇప్పటివరకు వచ్చిన ఐదూ మంచి హిట్లే. ఏడో సినిమాగా రామ్‌ చరణ్‌ చిత్రం ఉంటుంది అంటూ పుకార్లు వచ్చేశాయి. అయితే ఇది అంత ఈజీనా, అసలు వీలవుతుందా అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌ రెండు పెద్ద సినిమాలు ఒప్పుకున్నాడు. శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. బుచ్చిబాబు సానా సినిమా త్వరలో ప్రారంభం అంటున్నారు.

మరోవైపు రాజ్‌ కుమార్ హిరానీ – షారుఖ్‌ ఖాన్‌ ‘డంకీ’ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా అయ్యాక చరణ్‌ సినిమాల పనులు అయ్యాక కొత్త సినిమా మొదలవ్వాలి. అయితే హిరానీ సినిమా అంటే రెండు, మూడేళ్ల ప్రాజెక్ట్‌. కెరీర్‌ పీక్‌ స్టేజీలో ఉన్న చరణ్‌ ఇప్పుడు ఆయనతో సినిమా అంటే మరో మూడేళ్లు పోతాయి. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మూడేళ్లు ఫట్‌. ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా లేట్‌. ఈ నేపథ్యంలో హిరానీ సినిమా చేస్తే చాలా రోజులు పోతాయి అనేది పక్కా. మరి చరణ్‌ (Ram Charan) ఏం చేస్తాడో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus