Rana, Trivikram: రానా – త్రివిక్రమ్‌ సినిమా గుణశేఖర్‌దా?

  • September 14, 2022 / 07:43 PM IST

పాన్‌ ఇండియా సినిమాల సీజన్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలే కాకుండా, ఆ తర్వాతి స్థాయి హీరోలు కూడా పాన్‌ ఇండియా కథలకు ఓకే చెప్పేస్తున్నారు. తమ ఇమేజ్‌ అనే విషయాన్ని పక్కనపెట్టి.. కథకు ఉన్న సత్తాను పట్టుకుని పాన్‌ ఇండియాలో దూసుకుపోదాం అని చూస్తున్నారు. ఈ క్రమంలో రానా సోలోగా పాన్‌ ఇండియా సినిమా చేద్దాం అనుకుంటున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌ నడుస్తోంది. అయితే తాజాగా మరో టాక్‌ వినిపిస్తోంది.

రానా – త్రివిక్రమ్‌ కలసి చేద్దాం అనుకుంటున్న సినిమా కథ కొత్తది కాదట. గతంలో గుణశేఖర్‌ – రానా కాంబినేషన్‌లో వస్తుందని చెప్పిన సినిమానే. అదేనండీ ‘హిరణ్య కశ్యప’. ఈ సినిమా కథనే ఇప్పుడు రానా – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించాలని చూస్తున్నారట. గత మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని ఆ మధ్య గుణశేఖర్‌ చెప్పారు కూడా. అయితే ఇప్పుడు ఆ సినిమా బ్యానర్‌ కూడా మారుతోంది. దాంతోపాటు దర్శకుడు కూడా మారుతున్నారట.

తొలుత ‘హిరణ్య కశ్యప’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. కానీ ఇప్పుడు సురేశ్ బాబు మనసు మార్చుకుని సినిమాను హారిక హాసిని ఎంటర్‌టైన్మెంట్స్‌ వాళ్లకు ఇచ్చేశారని అంటున్నారు. ఈ మేరకు తివిక్రమ్, రానాకి మధ్య చర్చలు జరిగాక ఈ నిర్ణయం తీసుకున్నారట. మహేష్‌బాబు సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కొచ్చు అని అంటున్నారు.

నిజానికి మహేష్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో ‘హిరణ్యకశ్యప’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే హారిక హాసిని ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలసి సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మిస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌కి వెళ్లే సరికి అక్కడ కరణ్‌ జోహార్‌ ఓ నిర్మాత అవుతారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus