తేజు వలన ‘మైత్రి మూవీ మేకర్స్’ కు అదనపు ఖర్చు..?

సాయి ధరమ్ తేజ్ .. ఇప్పుడు సాయి తేజ్. ఈ మద్యే పేరు మార్చుకున్నాడు లెండి. ధరమ్ అంటే దారిద్రమని వాళ్ళ సిద్ధాంతి చెప్పాడట. అసలే ఇప్పటికే అరడజను ప్లాపులు అందుకున్నాడు. అందుకే సెంటిమెంట్ ప్రకారం పేరులో ధరమ్ తీసేసాడు. ఇక తేజు నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించింది. ఓడిపోవడం అలవాటైన ఓ యువకుడి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల ఆధారంగా… ఎంటర్టైనింగ్ ఈ చిత్రం సాగుతుందట. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 12న భారీస్థాయిలో విడుదల కాబోతుంది.

ఇక తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ముందుగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు ఈ వేడుకను ‘జేఆర్సీ కన్వెన్షన్’లో జరపాలనుకున్నారట. అక్కడైతే కాస్త తక్కువ ఖర్చుతో ఈ వేడుక పూర్తయ్యిపోతుంది. కానీ సాయితేజ్ మాత్రం శిల్పకళా వేదికలోనే ఈ వేడుకని జరపమని రిక్వెస్ట్ చేశాడట. శిల్పకళా వేదికలో జరుపుకున్న తన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయనీ .. అది తన సెంటిమెంట్ గా భావించి ఇలా కోరాడట. దాంతో నిర్మాతలు కూడా అంగీకరించి, ఈ వేడుకను శిల్పకళా వేదికలోనే నిర్వహించారట. దీంతో నిర్మాతలకి అదనంగా 9 లక్షలు అదనపు ఖర్చయ్యిందని సమాచారం. మరి తేజు సెంటిమెంట్లు ఈ చిత్రానికి ఎంతవరకూ కలిసొస్తాయో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus