ఈసారి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో..?

సమంత అక్కినేని… గతేడాది 3 హిట్లు కొట్టి లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరిపోయింది. అంతకు ముందు ఏడాది కూడా 3 హిట్ లు అందుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తరువాత హీరోయిన్లకు లైఫ్ ఉండడు అనే అపోహను సమంత కొట్టి పారేసిందనే చెప్పాలి. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు… ముఖ్యంగా నటన కు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తే.. ఎటువంటి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకోవచ్చో సమంత ప్రూవ్ చేసింది.

ఇదిలా ఉండగా… గత కొద్ది రోజుల నుండీ సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి.. ఆ టైములో సమంత.. ‘నేను ప్రెగ్నెంట్ అయితే.. ఆ శుభవార్త నేరుగా నేనే వెల్లడిస్తాను. సోషల్ మీడియా కు … సినిమాలకు దూరంగా ఉంటాను అని’ ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది అనే ప్రచారం ఊపందుకుంది.

త్వరలో అక్కినేని కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నాడు అని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు మంచి ఊపులో ఉన్నారు. ఇది నిజమో కాదో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఒకవేళ అబద్దం అయితే సమంత రియాక్ట్ అయ్యి ఆ వార్తలకు బ్రేక్ లు వేస్తుందేమో. నాగ చైతన్య – సమంత జంటకి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఇలా రూమర్స్ పుట్టిస్తున్నారు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus