Samantha: సమంత కూడా రెండో పెళ్ళికి రెడీ అయ్యిందా?

ఈ మధ్యనే నాగ చైతన్య (Naga Chaitanya) , రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో (Sobhita Dhulipala) చైతన్య నిశ్చితార్థం ఇటీవల జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిచేసుకోనున్నారు. అయితే మరి చైతన్య మాజీ భార్య సమంత (Samantha)  సంగతేంటి? ఆమె రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనే డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇలాంటి టైంలో సమంత ఆల్రెడీ ఇంకొకరితో డేటింగ్లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ (Raj Nidimoru) తో డేటింగ్లో ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Samantha

వీళ్ళు చాలా కాలంగా కలిసుంటున్నట్టు బాలీవుడ్ మీడియా అయితే కోడై కూస్తోంది. ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత (Samantha) కూడా నటించిన సంగతి తెలిసిందే. అందులో యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఆ సిరీస్ లో భాగంగా సమంత లవ్ మేకింగ్ సీన్స్ లో కూడా శృతి మించి నటించింది.ఆ టైంలో సమంత నాగ చైతన్యతో కలిసుంటున్న సంగతి తెలిసిందే.

దీంతో అక్కినేని అభిమానులు మాత్రమే కాదు ఆమె అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. కేవలం ఈ సిరీస్ వల్లే సమంత -చైతన్య విడిపోయారు అని చాలా మంది నమ్ముతారు. ఇక విడాకుల తర్వాత రాజ్ తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లలో కూడా సమంత నటించింది. ఆ టైంలోనే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యి ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..!

 పవన్ కు ఫోన్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారు.. సుధాకర్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus