Samantha, Salman: సామ్‌ బాలీవుడ్ ఎంట్రీ ఆ సినిమా సీక్వెల్‌తోనేనా..!

బాలీవుడ్‌లోకి సమంత ఎంట్రీ ఇస్తోంది… అంటూ చాలా నెలలుగా చెబుతూ వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వచ్చినప్పటి నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఏ పుకారు కూడా ఇప్పటివరకు నిజం కాలేదు. ఈ క్రమంలో ‘సమంత బాలీవుడ్‌ సినిమా’ అనే సిరీస్‌లో మరో కొత్త సినిమా పేరు వచ్చి చేరింది. ఈసారి ఏ చిన్న హీరో సినిమా కాదు… సల్మాన్‌ ఖాన్‌ సినిమా అంటున్నారు. సల్మాన్‌ హిట్‌ సినిమా ‘నో ఎంట్రీ’కి సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. అందులోనే సమంత నటిస్తోంది అని టాక్‌.

ముందుగా చెప్పినట్లు సమంత బాలీవుడ్‌ ప్రయత్నాలు చాలా రోజులుగా సాగుతున్నాయి. ఆ సినిమా, ఈ సినిమా అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. 2005లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ‘నో ఎంట్రీ’ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారు దర్శకుడు అనీజ్ బజ్మీ. తెలుగులో ‘పెళ్లాం ఊరెళితే’ హిందీ సీక్వెల్‌ ఈ ‘నో ఎంట్రీ’. బోనీ కపూర్ నిర్మించిన ఆ సినిమాలో సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ హీరోలుగా నటించారు. బిపాషా బసు, ఇషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీ నటించారు.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ తెరకెక్కించనున్నారు. ఇందులో సల్మాన్ సరసన సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో కూడా అనీల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించబోతున్నారట. వారి సరసన నటించే హీరోయిన్ల ఎంపిక కూడా కొనసాగుతోందట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు.

ఈ సినిమాతోపాటు ‘టైగర్ 3’ కూడా సెట్స్‌ మీద ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘నో ఎంట్రీ 2’ మొదలుపెడతారట. మరి ఈ సినిమాలో సమంతకు ప్లేస్‌ ఉంటుందా? అనేది చూడాలి. ఒకవేళ ఛాన్స్‌ దొరికితే సమంత బాలీవుడ్‌ ఎంట్రీ అదిరిపోతుందనే చెప్పాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus