తెలుగులో అనతి కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. శ్రీలీల సినిమా కెరీర్ ఇలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నా.. ఫలితాల విషయంలో ఎక్కడో చిన్న ఇబ్బంది కలుగుతోంది. ఆ మాటకొస్తే అది కాస్త పెద్ద ఇబ్బందే. కథల ఎంపిక విషయంలో లీల తప్పటడుగులు ఆమె కెరీర్‌ను ఇబ్బంది పెట్టేలా మారుతున్నాయి. ఇలాంటి మాటలు వస్తున్న సమయంలో ఆమె ‘తొలి’ సినిమా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు అని టాక్.
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. మూడో సినిమా కోసం అంతా సిద్ధమైంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చాలా నెలల క్రితం ప్రారంభమైన తొలి హిందీ సినిమా విషయంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో శ్రీలీల ఓ సినిమా చేసింది. ఆ సినిమానే ‘డైలర్’. ఆ సినిమా పూర్తయిందని, త్వరలో ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు మాడాక్ ఫిలిమ్స్ టీమ్ నుండి ఓ లీక్ బయటకు వచ్చింది. ఓటీటీ టీమ్‌లతో ఇప్పటికే ఈ విషయంలో చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చేశారు అని అంటున్నారు.
దీంతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ, ఓటీటీ ఎంట్రీ ఒకేసారి జరిగిపోతున్నాయి అనేది ఆమె ఫ్యాన్స్ మాట. బాలీవుడ్‌లో ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌లను కూడా ఘనంగానే చేస్తున్నారు. ఆ లెక్కన ఆమె ఎంట్రీ అలా అవ్వడమూ పెద్ద విషయమే. ఇక ఆ తర్వాతి సినిమా ‘ఆషికీ 3’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తుది దశకు వచ్చిందట. ఇదయ్యాక మరో యంగ్ హీరోతో అక్కడే ఓ సినిమా చేస్తుందని టాక్. ఇక తెలుగులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజ ‘మాస్ మహారాజ్’ ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్ ‘పరాశక్తి’లో నటిస్తోంది.