శ్రీలీల (Sreeleela) కొంత కాలంగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో (Kartik Aaryan) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు పలు ప్రైవేట్ పార్టీల్లో కూడా ఈ జంట సందడి చేసింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే శ్రీలీల అండ్ ఫ్యామిలీ.. కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి సందడి చేయడం జరిగింది. సాధారణంగా బాలీవుడ్లో ఓ సినిమాలో నటించే హీరో, హీరోయిన్లు ..
ఆ సినిమా ప్రమోషన్ కోసం అన్నట్టు ఎక్కువగా వారి గురించి వారే ఏదో ఉన్నట్టు.. గాసిప్స్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత అది సినిమా కోసం అంటూ చెప్పి ఆ ఇష్యూకి క్లారిటీ ఇస్తారు. శ్రీలీల- కార్తీక్ ఆర్యన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి.. అందరూ ఇలాగే అనుకుంటున్నారు. కానీ ఒకానొక ఈవెంట్లో కార్తీక్ ఆర్యన్ తల్లి తనకు కాబోయే కోడలు డాక్టర్ అంటూ చెప్పింది. శ్రీలీల కూడా డాక్టర్ చదువు పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా శ్రీలీలకి సంబంధించిన కొన్ని ఫోటోలు షాకిస్తున్నాయి. విషయం ఏంటంటే..శ్రీలీల మేకప్ ఆర్టిస్ట్ ‘బిగ్ డే శ్రీలీల’ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది. అందులో శ్రీలీల అలంకరణ చూస్తుంటే.. కచ్చితంగా ఆమె ఏదో ఫంక్షన్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. మరికొన్ని ఫోటోల్లో ఆమె బంధువులు ఆమె మొహానికి పసుపు రాయడాన్ని గమనించవచ్చు. దీంతో శ్రీలీల సైలెంట్ గా కార్తీక్ ఆర్యన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అని కొందరు భావిస్తున్నారు. అసలు మేటర్ ఏంటనేది ఆమె రివీల్ చేస్తేనే ఓ క్లారిటీ వస్తుంది.