Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 31, 2025 / 10:00 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిఖిల్ దేవాదుల (Hero)
  • సమ్యు రెడ్డి (Heroine)
  • రంగనాథ్, ప్రభాకర్, ఆర్విక గుప్తా తదితరులు.. (Cast)
  • అమర్ కామేపల్లి (Director)
  • ఎం.సి.రాజు (Producer)
  • ఫ్లావియో జి. కుక్కూరుళ్లో (Music)
  • ఎస్ ఎస్. మనోజ్ (Cinematography)
  • Release Date : మే 31, 2025
  • ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ (Banner)

తెలుగులో థ్రిల్లర్స్, అది కూడా మెంటల్ హెల్త్ గురించి, పిల్లలు పడే ప్రెజర్ గురించి డిస్కస్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే “ఘటికాచలం”. చైల్డ్ ఆర్టిస్ట్ గా 70కి పైగా సినిమాల్లో నటించిన నిఖిల్ దేవాదుల హీరోగా పరిచయమవుతూ నటించిన ఈ చిత్రానికి “బ్రేకప్” (2013) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అమర్ కామేపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Ghatikachalam Review

Ghatikachalam Movie Review and Rating

కథ: కౌశిక్ (నిఖిల్ దేవాదుల) ఎంబీబీఎస్ స్టూడెంట్. తనకి ఇష్టం లేకపోయినా తండ్రి (ప్రభాకర్) కోసం కష్టపడి చదువుతుంటాడు. కనీసం తల్లిని ఇష్టమైన టిఫిన్ చేసిపెట్టమని కూడా అడగలేని ఇంట్రోవర్ట్. అలాంటోడు ప్రెజర్ తట్టుకోలేక తనలో తానే మాట్లాడుకుంటూ.. ఊహించని విధంగా ఘటికాచలంలా మారిపోతాడు.

అసలు వారే ఘటికాచలం? కౌశిక్ కి ఎలా పరిచయం? అతడి ఎంట్రీతో కౌశిక్ లైఫ్ ఎలా మారింది? అనేది “ఘటికాచలం” కథాంశం.

Ghatikachalam Movie Review and Rating

నటీనటుల పనితీరు: హీరోగా పరిచయ చిత్రంతోనే నటుడిగా తనదైన బలమైన మార్క్ ను వేశాడు నిఖిల్. ఈ పాత్ర పోషించడం అతడు మానసికంగా, శారీరికంగా పడిన శ్రమను కచ్చితంగా మెచ్చుకోవాలి. అక్కడక్కడా కొన్ని హాలీవుడ్ సినిమాల పెర్ఫార్మెన్సులు గుర్తుకొచ్చినప్పటికీ.. నటుడిగా నిఖిల్ ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఏకపాత్రాభినయం చేస్తాడు. భయపెట్టాడు, నవ్వించాడు, బాధపెట్టాడు. మంచి భవిష్యత్ ఉన్న నటుడు నిఖిల్ అని చెప్పొచ్చు.

తండ్రి పాత్రలో ప్రభాకర్, చెల్లెలుగా తన్మయ్, స్నేహితురాలిగా సమ్యు రెడ్డిలు డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

కీలకమైన డాక్టర్ పాత్రకు ఆర్విక గుప్తా పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోయింది. ముఖ్యంగా డైలాగ్స్ కి లిప్ సింక్ లేకపోవడం, కీ సీక్వెన్సుల్లో సరైన స్థాయి నటన కనబరచకపోవడంతో.. హైలైట్ అవ్వాల్సిన పాత్ర తేలిపోయింది.

Ghatikachalam Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ మనోజ్ పనితనాన్ని, ఎడిటర్ శ్రీను టాలెంట్ ను మెచ్చుకోవాలి. సినిమాకి పూర్తిస్థాయి న్యాయం చేసిన టెక్నీషియన్స్ వీళ్లే. ఊహకి, నిజానికి మధ్య తేడాను చూపించిన విధానం అలరించగా.. జంప్ కట్స్ లేని క్లీన్ ఎడిటింగ్ ఫార్మాట్ తో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాడు ఎడిటర్ శ్రీను.

ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా కౌశిక్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. పాత్ర తాలూకు ఆలోచనలోని తీవ్రత బట్టి లైటింగ్, డి.ఐ వంటి విషయాల్లో చూపిన టెక్నికల్ థాట్ ప్రాసెస్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి.

అలాగే.. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా డిస్కస్ చేసే మెంటల్ హెల్త్ టాపిక్ ను మెయిన్ స్ట్రీమ్ సినిమా ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పిన విధానం కచ్చితంగా మెచ్చుకోవాలి. అయితే.. ఆ ఒక్క అంశం కోసం సినిమాని ఏకంగా రెండు గంటల పాటు సాగదీయడం అనేది వర్కవుట్ అవ్వలేదు. ఒక సీరియస్ అంశాన్ని ఆసక్తికరంగా చెప్పడం అనేది చాలా క్రూషియల్, ఆ విషయంలో దర్శకుడు అమర్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆలోచన బాగున్నా.. ఆచరణ విషయంలో అలరించలేక చతికిలపడ్డాడు.

Ghatikachalam Movie Review and Rating

విశ్లేషణ: “ఘటికాచలం” లాంటి సినిమాలు మన సమాజానికి అవసరం, “మెంటల్ హెల్త్” గురించి డిస్కస్ చేయడమే కాక, వాటికి పరిష్కారం చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే.. ఆ అంశాన్ని అర్థవంతంగానే కాక, ఎగ్జైటింగ్ గానూ చూపించడం కీలకం. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే “ఘటికాచలం” గురించి అందరూ డిస్కస్ చేసుకునేవారు. అది లోపించడంతో ఓ సాధారణ సినిమాగా మిగిలిపోయింది.

Ghatikachalam Movie Review and Rating

ఫోకస్ పాయింట్: గుడ్ ఐడియా.. బ్యాడ్ ఎగ్జిక్యూషన్!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Kamepalli
  • #Ghatikachalam
  • #Nikhil Devadula
  • #Samyu Reddy

Reviews

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

trending news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

6 mins ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

29 mins ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 hour ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago

latest news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

16 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

16 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

22 hours ago
నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version