Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 30, 2025 / 12:39 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్, నారా రోహిత్ (Hero)
  • ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది (Heroine)
  • జయసుధ,సందీప్ రాజ్,అజయ్,రాజా రవీంద్ర,వెన్నెల కిశోర్ తదితరులు.. (Cast)
  • విజయ్ కనకమేడల (Director)
  • కె.కె. రాధామోహన్ (Producer)
  • శ్రీ చరణ్ పాకాల (Music)
  • హరి కె వేదాంతం (Cinematography)
  • Release Date : మే 30, 2025
  • పెన్ స్టూడియోస్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ (Banner)

హీరోలుగా అనుకోకుండా అయిదారేళ్ళ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith) , బెల్లంకొండ శ్రీనివాస్  (Bellamkonda Sai Sreenivas) లు కలిసి నటించిన సినిమా “భైరవం” (Bhairavam). తమిళంలో తెరకెక్కిన “గరుడన్” చిత్రానికి రీమేక్ ఇది. రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు దర్శకుడు విజయ్ కనకమేడల. మరి సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

Bhairavam Review

Bhairavam Movie to Release with Some Changes

కథ: దేవీపురంలో వెలిసిన వారాహి అమ్మవారి గుడి ఆస్తుల మీద కన్నేస్తాడు మినిస్టర్. 75 ఎకరాల ఆ భూమిని దక్కించుకోవాలంటే.. ఊరి పెద్దల్లాంటి వరద (నారా రోహిత్) మరియు గజపతి (మంచు మనోజ్) మరియు వాళ్ళిద్దరికీ కాపలా కాసే శీను (బెల్లంకొండ శ్రీనివాస్)లను దాటి వెళ్ళాలి.

ఆ భూమి దక్కించుకోవడం కోసం మినిస్టర్ ఏం చేశాడు? స్నేహితులు వరద, గజపతి మధ్య ఈ భూమి, డబ్బు ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ అంతర్యుద్ధంలో శీను ఎలా నలిగిపోయాడు? చివరికి ఏం జరిగింది? అనేది “భైరవం” (Bhairavam) కథాంశం.

Bhairavam Movie Review and Rating1

నటీనటుల పనితీరు: ముగ్గురు హీరోలకి సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ & స్పేస్ ఉన్నప్పటికీ.. తనదైన శైలి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నారా రోహిత్ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. అతడి భాషలో స్పష్టత, బాడీ లాంగ్వేజ్ లో పెద్దరికం కొట్టొచ్చినట్లు కనబడతాయి. మంచు మనోజ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు. కాకపోతే.. ప్రతి సన్నివేశానికి ఎమోషన్ తో సంబంధం లేని బేస్ వాయిస్ తో కాస్త ఇబ్బందిపెట్టాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ను ఇప్పటివరకు ఈ తరహా పాత్రలో చూడకపోవడం వల్ల కాస్త కొత్తగా కనిపించాడు. పూనకం వచ్చే సన్నివేశాల్లో తనదైన ప్రతిభ కనబరిచాడు. ఆ సీన్స్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. నారా రోహిత్, మంచు మనోజ్ లను తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో శ్రీనివాస్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి.

దివ్య పిళ్లై (Divya Pillai) , ఆనంది (Anandhi), అజయ్ (Ajay Raj) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

హీరోయిన్ గా నటించిన అదితి శంకర్ (Aditi Shankar)స్క్రీన్ ప్రెజన్స్ అసలే విలేజ్ నేటివిటీకి సింక్ అవ్వలేదు అనుకుంటే.. ఆమెకి చెప్పించిన డబ్బింగ్ ఇంకాస్త చిరాకుపెట్టింది. చెప్పాలంటే.. ఈ సినిమాకి అదితి శంకర్ నటన కంటే డబ్బింగ్ మెయిన్ మైనస్ గా నిలిచింది.

Bhairavam Movie Review and Rating1

సాంకేతికవర్గం పనితీరు: నిన్నమొన్నటివరకు థ్రిల్లర్ సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తూ వచ్చిన శ్రీచరణ్ పాకల (Sricharan Pakala) మొదటిసారి ఓ పక్కా మాస్ సినిమాకి వర్క్ చేశాడు. పాటల విషయంలో పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. నేపథ్య సంగీతం విషయంలో తన మార్క్ ను చాటాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.

సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ సినిమాకి ప్లస్ పాయింట్ గానే నిలిచాయి.

వెట్రిమారన్ కథను తెలుగు నేటివిటీకి మార్చడంలో విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)  కొంతమేరకు విజయం సాధించాడు. అయితే.. సెంటిమెంట్స్ ను పండించే విషయంలో మాత్రం తడబడ్డాడు. చాలా చిన్నపాటి మార్పులే చేసినప్పటికీ.. కొన్ని కీ సీన్స్ లో ఎమోషన్ మిస్ అయ్యింది. అయితే.. ముగ్గురు హీరోలను మ్యానేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్ళకి కూడా ఇంకాస్త మంచి ఎక్స్ పీరియన్స్ ఉండేది. మాస్ ఫైట్స్, యాక్షన్ బ్లాక్స్ & సెంటిమెంట్ సీన్స్ వరకు పర్వాలేదు కానీ.. పూర్తిస్థాయి కథ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్ లో కాస్త తప్పులు దొర్లాయి, ముఖ్యంగా జంప్ కట్స్ మరీ ఎక్కువయ్యాయి. అందువల్ల స్మూత్ ఫ్లో డబ్బతిన్నది.

Bhairavam Movie Review and Rating1

విశ్లేషణ: సాధారణంగా రీమేక్ సినిమాలకి ప్రెడిక్టబిలిటీ మైనస్ అవుతుంది. కానీ.. “భైరవం” సినిమాకి ప్రాసలు మైనస్ గా మారాయి. అలాగే.. ఎమోషన్స్ ను ప్రాపర్ గా పండించలేదు. క్యారెక్టర్స్ ద్వారా రీజనింగ్ అనేది వర్కవుట్ చేయకపోవడం వల్ల.. ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. అందువల్ల తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కాస్తా.. తెలుగులో యావరేజ్ గా మిగిలిపోయింది.

Bhairavam Movie Review and Rating1

ఫోకస్ పాయింట్: మాస్ మసాలా ఆడియన్స్ కు మాత్రమే!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Manchu manoj
  • #Nara Rohith
  • #Vijay KanakaMedala

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

10 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

16 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

17 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

18 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

18 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version