Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 30, 2025 / 06:21 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రూపేష్ (Hero)
  • ఆకాంక్ష సింగ్ (Heroine)
  • రాజేంద్రప్రసాద్, అర్చన, ఆనంద చక్రపాణి తదితరులు.. (Cast)
  • పవన్ ప్రభ (Director)
  • రూపేష్ (Producer)
  • ఇళయరాజా (Music)
  • రామ్ (Cinematography)
  • Release Date : మే 30, 2025
  • మా ఆయి ప్రొడక్షన్స్ (Banner)

రూపేష్ స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటించిన చిత్రం “షష్టిపూర్తి” (Shashtipoorthi). పవన్ ప్రభ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. రాజేంద్రప్రసాద్-అర్చన కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు (మే 30) విడుదలైంది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Shashtipoorthi Review

కథ: తల్లి భువనేశ్వరి (అర్చన) మాట జవదాటకుండా పెరిగిన కొడుకు రామ్ (రూపేష్). మంచి లాయర్ గా పేరు తెచ్చుకొని అబద్ధం ఆడకుండా న్యాయం వైపు ఒంటరిగా నిలబడతాడు.

తొలిచూపులో ప్రేమించిన జానకి (ఆకాంక్ష సింగ్) కోసం అబద్ధం చెప్పడం మొదలెడతాడు.

నిజాయితీపరుడిగా పెంచిన తన కొడుకు ఇలా అన్యాయానికి కొమ్ము కాయడంతో కలత చెందిన భువనేశ్వరి, 30 ఏళ్ల పెళ్లి బంధానికి స్వస్తిపలుకుతూ భర్త దివాకరం (రాజేంద్రప్రసాద్)కు విడాకుల నోటీస్ పంపుతుంది.

తల్లిదండ్రుల మధ్య రేగిన చిచ్చు ఏమిటి? కొడుకు రామ్ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేశాడు? అనేది “షష్టిపూర్తి” (Shashtipoorthi) కథాంశం.

నటీనటుల పనితీరు: రాజేంద్రప్రసాద్ మరోసారి బరువైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మంచి వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో, తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. రాజేంద్రప్రసాద్ తో సమానమైన నటప్రతిభతో ఆకట్టుకుంది అర్చన. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన అలరిస్తుంది. ఆకాంక్ష సింగ్ పాత్రకి సరైన క్లారిటీ లేకపోయినా.. ఆమె నటన మాత్రం డీసెంట్ గా ఉంది. లిప్ సింక్ ఇవ్వడానికి విశ్వప్రయత్నం చేసింది. ఇక రూపేష్ కథానాయకుడిగా, నిర్మాతగా ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించాడు. నిర్మాతగా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. నటుడిగా మాత్రం ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉంది. డైలాగ్స్ విషయంలో పర్లేదు కానీ.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి.

సాంకేతికవర్గం పనితీరు: ఇళయరాజా సంగీతం వినసొంపుగా ఉంది. నేపథ్య సంగీతం డీసెంట్ గా ఉంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ వంటివన్నీ నీట్ గా ఉన్నాయి. నిజానికి సినిమాకి కావాల్సినదానికంటే ఎక్కువే ఖర్చు చేశారు.

దర్శకుడు పవన్ ప్రభ కోర్ పాయింట్ ను “ఏప్రిల్ 1 విడుదల” నుంచి స్ఫూర్తి పొంది, దానికి కంప్లీట్ ఆపోజిట్ గా పిక్ చేసుకొని వింటేజ్ ఫీల్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే.. పాయింట్ డీసెంట్ అయినప్పటికీ, టీట్మెంట్ చాలా ఓల్డ్ ఫార్మాట్ లో ఉండడం అనేది సినిమాకి మైనస్ గా మారింది. మరీ ముఖ్యంగా సంభాషణల్లో పట్టు లోపించింది. ఇక.. కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ను డీల్ చేసిన విధానం చాలా సిల్లీగా ఉంది. ఇంత చిన్న పాయింట్ ను 30 ఏళ్లుగా సాగదీయడం అనేది కామెడీ అయిపోయింది. ఎంతో డీప్ ఎమోషన్ పండాల్సిన సందర్భాలు, సన్నివేశాలు కూడా సరిగా వర్కవుట్ అవ్వలేదు. అందువల్ల.. కథకుడిగా, దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.

విశ్లేషణ: మంచిని మంచిగా చెప్పడం ఎంత ముఖ్యమో, అదే మంచిని ఆసక్తికరంగా చెప్పడం కూడా అంతే ముఖ్యం. దర్శకుడు పవన్ ప్రభ ఈ పాయింట్ ను పెదచేవిన పెట్టి, 80ల నాటి టేకింగ్ స్టైల్ తో “షష్టిపూర్తి” చిత్రాన్ని తెరకెక్కించడం అనేది పెద్ద రిస్క్. ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ మాత్రమే కాదు, పాతతరం ప్రేక్షకులు కూడా కొత్త తరహా మేకింగ్ ను ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని పవన్ ప్రభ కాస్త సీరియస్ గా తీసుకుంటే అతని భవిష్యత్ సినిమాలైనా జనరంజకంగా ఉంటాయి.

ఫోకస్ పాయింట్: ఈ తరం ప్రేక్షకులకి ఈ టైప్ ట్రీట్మెంట్ కష్టం!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #Achyuth
  • #Muralidhar Goud
  • #Pavan Prabha
  • #Rajendra Prasad

Reviews

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

trending news

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

9 hours ago
National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

12 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

13 hours ago
Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

14 hours ago
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

14 hours ago

latest news

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

15 hours ago
Kalpika Ganesh: ‘నా కూతురికి మెంటల్..పిచ్చాసుపత్రికి పంపండి’… కల్పిక తండ్రి షాకింగ్ కామెంట్స్.. !

Kalpika Ganesh: ‘నా కూతురికి మెంటల్..పిచ్చాసుపత్రికి పంపండి’… కల్పిక తండ్రి షాకింగ్ కామెంట్స్.. !

16 hours ago
Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

16 hours ago
Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

16 hours ago
Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version