విక్రమ్ సినిమాతో హీరోగా మొదలైన అక్కినేని నాగార్జున సినీ ప్రయాణం, ప్రస్తుతం 99 సినిమాల ప్రస్థానం తరువాత ప్రతిష్టాత్మక 100వ చిత్రం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 99 చిత్రాల తన కెరీర్ లో అనేక మందికి మెగా ఫోన్ చేతబట్టే అవకాశం ఇచ్చాడు నాగార్జున. సీనియర్ హీరోలలో ఎక్కువ మందిని డైరెక్టర్లుగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిన హీరో నాగార్జున మాత్రమే. అయితే 100వ సినిమాలో నాగార్జున కు అత్యంత సన్నిహితురాలు, సీనియర్ హీరోయిన్ టబు నటించబోతుందని గత కొన్నిరోజులుగా కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందిస్తూ నాగార్జున ఈ విధంగా అన్నారు.
నాగార్జున సరసన నటించిన హీరోయిన్లలో కొంత మంది రిపీటెడ్ గా ఆయన కాంబోలో హిట్లు అందుకొని నాగ్ కు లక్కీ ఛార్మ్స్ అయ్యారు. వారిలో ఒకరు సీనియర్ హీరోయిన్ టబు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే ఇలా పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలలో వీరి మధ్య కెమిస్ట్రీ కి అప్పట్లో సెపెరేట్ ఫ్యాన్స్ ఉండేవారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ” టబు నా కేరీర్ మొదటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. నా 100వ చిత్రం అనగానే తాను కూడా ఈ మూవీలో నటించాలనే ఆసక్తి చూపిస్తోంది అని అన్నారు”. ఇదంతా చూస్తే నాగ్ 100వ చిత్రంలో టబు నటించటం ఖాయమే అంటున్నారు నెటిజన్లు.
అయితే నాగార్జున 100వ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమిళ్ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తాడని టాక్.