నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఆయన ఎనర్జీ మాత్రం ఇంకా యూత్‌ను మించిపోతూనే ఉంటుంది. తెరపై యాక్షన్ సినిమాలతో అభిమానులను ఊపేస్తూనే, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య. హీరోగా మాత్రమే కాదు… ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీరు మెచ్చుకోదగింది.
రీసెంట్‌గా బాలయ్యకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్‌ను సరదాగా అనుకరిస్తూ, అద్దాలను గాల్లోకి విసిరే ప్రయత్నం చేయడం. అది ఆశించినట్టు జరగకపోవడం, వెంటనే స్మైల్‌తో పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఇలా ఇవన్నీ అభిమానులకు నవ్వులు తెప్పించాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు. కొందరు “బాలయ్య స్టైల్ బాలయ్యదే” అంటుంటే, మరికొందరు “ఈ వయసులోనూ అలాంటి స్టంట్లు అవసరమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, గతంలో భారీ యాక్షన్ సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు NBK111 వర్కింగ్ టైటిల్‌తో మరో హై వోల్టేజ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. భారీ యాక్షన్, విఎఫ్ఎక్స్‌తో ఈ చిత్రం కొత్త లెవల్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన కెరియర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ కూడా రాబోతోంది.
మొత్తానికి తెరపై నటసింహం, అసెంబ్లీలో ప్రజాప్రతినిధి, సేవారంగంలో హాస్పిటల్ చైర్మన్. ఈ మూడింటింకి బాలయ్య సమన్యాయం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.