Sumanth: ‘సుమంత్‌ పెళ్లి కార్డు’పై వేరే మాటలు వినిపిస్తున్నాయే!

సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది చాలా రొటీన్‌ మాట. అయితే సినిమాల ప్రచారం… వింత పుంతలు తొక్కుతోంది అని కూడా అనొచ్చు. వ్యక్తిగత జీవితాన్ని సినిమాకు కలపొద్దని చెప్పే మన హీరోలు, హీరోయిన్లు… ఇప్పుడు ఆ రెండింటిని కలిపేస్తున్నారు. తాజాగా సుమంత్‌ పెళ్లి కార్డు కూడా ఇలాంటి ప్రచారమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇటీవల వైరల్‌ అయిన పెళ్లి కార్డు వెనుక పెద్ద కథే ఉందట. ‘సుమంత్‌ కుమార్‌ వెడ్స్‌ పవిత్ర’ అంటూ ఇటీవల ఓ వెడ్డింగ్‌ కార్డు డిజైన్‌ ఒకటి వైరల్‌ అయ్యింది.

దీనిపై సుమంత్‌ నుండి ఎలాంటి సరైన సమాచారం లేకపోయినా… అతను డివోర్సీ కావడంతో రెండో పెళ్లేమో అని అందరూ అనుకున్నారు. ఈలోగా వర్మ ఈ పుకారుకు ఆజ్యం పోస్తూ తనదైన శైలిలో సుమంత్‌ మీద విరుచుకుపడ్డారు. దీంతో ‘పెళ్లి పక్కా’ అనుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే… ‘పెళ్లి లేదు గిల్లి లేదు.. అది సినిమా కోసం చేసిన కార్డు.. ఎలాగో లీకైంది’ అంటూ సుమంత్‌ అనౌన్స్‌ చేశాడు. అంతా చూస్తుంటే అది లీక్‌ అవ్వలేదని,

సినిమా ప్రచారం కోసం సుమంత్‌ టీమ్‌ చేసిన పనే అని అర్థమవుతోంది. ​సినిమా కాన్సెప్ట్‌ అందరికీ తెలిసేలా ఇలా ప్రచారం చేస్తే బాగుంటుందని అనుకున్నారట. మరోవైపు వర్మతో ఈ పని చేయించింది కూడా సుమంతేనని తెలుస్తోంది. వర్మ కాంట్రవర్శీ చేస్తే… ప్రచారం ఎక్కువవుతుందని అనుకున్నారేమో మరి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus