మహేష్ సిగరెట్లు మానేయడానికి అసలు కారణం అదే..?

  • March 1, 2019 / 12:30 PM IST

ఒకప్పుడు మహేష్ బాబు చైన్ స్మోకర్ అని అందరికీ తెలిసిన సంగతే. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత దీనికి మహేష్ మరింత అలవాటు పడిపోయాడట. ఎంత కాదన్నా… రోజుకి కనీసం మూడు,నాలుగు పెట్టెల సిగరెట్లు కాల్చేవాడట. ఇక సినిమాల్లో కూడా మహేష్ సిగరెట్లు కలుస్తున్న సీన్లు చాలా ఉండేవి. ‘బాబీ’ ‘ఒక్కడు’ ‘పోకిరి’ ‘అతిధి’ వంటి చిత్రాల్లో మహేష్ సిగిరెట్లు తాగుతున్న సీన్లు చాలా ఉంటాయి. అయితే ‘ఖలేజా’ చిత్రం నుండీ మహేష్ అస్సలు సిగరెట్లు కాల్చే సీన్లు ఒక్కటి కూడా లేవు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో స్మోకింగ్ సీన్ ఉన్నప్పటికీ.. మహేష్ దానికి అంగీకరించలేదంట.., సీన్ డిమాండ్ చేస్తుండడంతో… ఏదో నామ మాత్రంగా సిగరెట్టు నోటిలో పెట్టుకోవడానికి మాత్రమే అంగీకరించాడట. అసలు మహేష్ ఇలా ‘గుడ్ బాయ్’ లా ఎలా మారిపోయాడు..? అనేగా మీ డౌట్.

మహేష్ ని ఓ ఫ్రెండ్… సిగిరెట్లు మానిపించేసాడట. ఆ ఫ్రెండ్ ఎవరనుకున్నారు… ఓ పుస్తకం. విషయంలోకి వెళితే … ‘అలెన్ కర్’ అనే ఆంగ్ల రచయిత రాసిన బుక్ ప్రభావం మహేష్ పై పడిందట. ఆ పుస్తకాన్ని ఓ ఫ్రెండ్ మహేష్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. నో స్మోకింగ్ జోన్ లోకి ఎలా వెళ్ళొచ్చో ఆ పుస్తకంలో ఉందట. ఆ పుస్తకం చదివాక మహేష్ వెంటనే సిగరెట్స్ కి గుడ్ బై చెప్పేశాడట. అంతేకాదు ఎవరూ పొగ తాగవద్దంటూ అభిమానులకు చెప్పుతున్నాడట మన సూపర్ స్టార్. అందుకే అంటారేమో ‘మంచి పుస్తకం … మంచి స్నేహితుడు లాంటిది’ అని..! ఇప్పుడు మన మహేష్ ని చూడండీ.. మంచి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఈ విషయంలో మహేష్ ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది సిగరెట్లు మానేస్తున్నారని సమాచారం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus