రష్మిక మహేష్ ను రిజెక్ట్ చేయడానికి కారణం ఆదేనా ?

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉంటే అది రష్మిక మండన్న అనే చెప్పాలి. విజయ్ దేవరకొండతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ నాలుగు క్రేజీ సినిమాలున్నాయి.. వాటిలో అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా ఒకటి. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో అని కన్ఫర్మ్ చేసింది రష్మిక మండన్న.

అయితే.. ఈ సినిమా కోసమే మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాను వదులుకొంది రష్మిక మండన్న. బేసిగ్గా.. అల్లు అర్జున్ కంటే పెద్ద హీరో అయిన మహేష్ బాబు సినిమాను వాదులుకోవడానికి ఏ హీరోయినూ ఇష్టపడదు. కానీ.. అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ కంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్ కి కథలో ప్రాముఖ్యతతోపాటు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా ఆలోచించిన రష్మిక కావాలనే మహేష్ బాబు సినిమా వదిలేసుకుని.. అల్లు అర్జున్ సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది. ఈలెక్కన రష్మిక చాలా తెలివిగా అడుగులేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus