Sarkaru Vaari Paata: హైప్‌ పెంచితే… లాభం కన్నా నష్టమే ఎక్కువా?

సినిమా ప్రచారంలో టీమ్‌ వంద మాటలు చెబుతుంది… అయితే థియేటర్‌కి వెళ్లాక ప్రేక్షకుడికి నచ్చితేనే చూస్తాడు. టీమ్‌ చెప్పిన వందలో ఏ పదో, ఇరవయ్యో లేకపోతే ఓకే కానీ.. ఎనభయ్యో, తొంభయ్యో లేకపోతే… సినిమా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంటుంది. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ పరాజయానికి కూడా ఇలాంటి కారణమే ఉంది అంటున్నారు. సినిమా తొలి షో పూర్తవ్వగానే సినిమా టాక్‌ గురించి చెప్పడం కాదు కానీ, సినిమా విషయంలో ఏ వర్గమూ ఆనందంగా లేకపోవడంతోనే కారణాలు వెతకాల్సి వస్తోంది.

‘సర్కారు వారి పాట’ మొదలైన రోజుల్లో మహేష్‌ బాబును నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో చూపిస్తామని చెబుతూ వచ్చింది చిత్రబృందం. విడుదల చేసిన ప్రీ లుక్‌లు, పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌.. ఇలా అన్నింటా మహేష్‌ లుక్‌, యాటిట్యూడ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నీ మాసీగా అదిరిపోయాయి. అయితే సినిమా ఎంత మాస్‌గా ఉంటుందో, అంతే కూల్‌గా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో ఓ రెండు సినిమాల పేర్లు గట్టిగా వాడుకుంది.

అవే… ‘పోకిరి’, ‘గీత గోవిందం’. టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన ఈ రెండు సినిమాల కలయికలా ‘సర్కారు వారి పాట’ సినిమా ఉంటుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. దీంతో సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయయి. మహేష్‌బాబు కెరీర్‌లో ది బెస్ట్‌ వర్క్ ‘పోకిరి’ అయితే, దర్శకుడు పరశురామ్‌ కెరీర్‌లో ‘గీత గోవిందం’ సినిమాను బెస్ట్‌ వర్క్‌ అనొచ్చు. ‘ఈ రెండూ కలసి వస్తే నా సామిరంగా’ అంటూ ఫ్యాన్స్‌ పూనకాలు తెచ్చుకుని థియేటర్లకు వెళ్లారు. కానీ అక్కడ చూస్తే ఆశించిన స్థాయిలో స్టఫ్‌ లేదు అంటున్నారు ఫ్యాన్స్‌.

అలా రెండు పెద్ద సినిమాలను రిఫరెన్స్‌ పెట్టి ‘సర్కారు వారి పాట’ సినిమాను లేపాలి అనుకోవడం వల్లే ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఈ సమస్య వచ్చింది అనేది టాక్‌. ఒకవేళ ఇలాంటి హైప్‌లు ఏవీ లేకపోయుంటే సినిమా అలరించేదేమో. దీంతో హైప్‌ ఇచ్చి, దెబ్బ తినడమంటే ఇదే అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus