మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej).. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలే ఎంపిక చేసుకుంటున్నాడు. మాస్ అభిమానులను విపరీతంగా ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ.. అతను సేఫ్ గేమ్ ఆడాలని చూడట్లేదు. ‘ముకుంద’ (Mukunda) ‘కంచె’ (Kanche) ‘ఫిదా’ (Fidaa) ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) వంటి సినిమాలు చూస్తే.. ఆ విషయంపై అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ‘మట్కా’ Matka) సినిమా కోసం కూడా వరుణ్ చాలా కష్టపడ్డాడు. కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వాల్తేరు వాసు అనే కూలీగా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు.
టీజర్, ట్రైలర్స్ కనుక గమనిస్తే.. ఈ సినిమాలో 3 , 4 పాత్రల్లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. 25 ఏళ్ల కుర్రాడిగా.. తర్వాత 40 లలో లుక్..లో ఆ తర్వాత 55 -60 ఏళ్ళ ఏజ్ గ్రూప్ కి చెందిన వృద్ధుడు పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. లుక్స్ విషయంలో వరుణ్ చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు.
ముఖ్యంగా ఈ సినిమాలో లుక్స్ కి అతను ఎంత కష్టపడ్డాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ వీడియో వేసి చూపించారు. ముఖ్యంగా వృద్ధుడి పాత్రకు సంబంధించిన వరుణ్ తన ఎక్స్పీరియన్స్..ని తెలియజేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ” ‘మట్కా’ సినిమాలో 50 ఏళ్ల వయసు కలిగిన పాత్ర కోసం డబ్బింగ్ వద్ద చాలా జాగ్రత్తలు వహించాము. ఆ పాత్ర కోసం మౌత్ పీస్ వాడాను.
వయసు మీద పడినప్పుడు గడ్డం కింద భాగంలో మార్పులు వస్తాయి. దాని వల్ల గొంతు కూడా మారుతుంది. సో కొంచెం అది కొంచెం టిపికల్ గా అనిపించింది. మిగిలిన పాత్రలతో(లుక్స్) తో పోలిస్తే.. ఇది కొంచెం వైవిధ్యంగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు.