హీరోలంటే ఫ్యాన్స్.. అన్- కండిషనల్ లవ్ చూపిస్తుంటారు. వాళ్ళ ప్రేమకి ఎటువంటి లాజిక్కులు కాలిక్యులేషన్లు ఉండవు. తప్పా… రైటా అన్నది తర్వాత, ఇష్టమైన హీరోని ఓ మాట అంటే అభిమానులు తట్టుకోలేరు. కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ‘మెగా వర్సెస్ అల్లు అర్జున్’ మాటల యుద్దానికి కారణం అదే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి స్టార్ ఇమేజ్ వచ్చే వరకు చిరు (Chiranjeevi) , పవన్ (Pawan Kalyan)..ల రిఫరెన్స్..లు వాడుకున్నాడు.
ఒకసారి పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహానికి అతని అడ్డుకట్ట వేయాలని చూశాడు. అది తిరిగి అతనికే ఎఫెక్ట్ అయ్యింది. సరే చిరంజీవి కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని బన్నీ వ్యతిరేకించాడు అని.. మెగా ఫ్యాన్స్ కూడా ఆ టైంలో అల్లు అర్జున్ ని వెనకేసుకురావడం జరిగింది. అందువల్ల అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీ ఎక్కువ కాలం నిలబడలేదు.కానీ తర్వాత పరిస్థితులు ఎందుకో మారిపోయాయి. అల్లు అర్జున్ (Allu Arjun) ఎందుకో మెగా అనే బ్రాండ్ కి దూరంగా ఉండాలని తపిస్తున్నాడు.
అతని వ్యవహార శైలి కూడా అది నిజమే అన్నట్టు సంకేతాలు ఇస్తుంది. చిరంజీవి వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు.. అన్నది మెగా అభిమానుల మాట. కానీ ‘అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడ?’ అనేది అల్లు అర్జున్ ఆర్మీ చెబుతున్న మాట. నిన్న వరుణ్ తేజ్ (Varun Tej) కామెంట్స్ తో ఇప్పుడు ట్విట్టర్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. ‘మట్కా’ (Matka) ‘పుష్ప 2’ (Pushpa 2) ల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఈ ట్రోల్స్ కి, మాటల యుద్దానికి ఫుల్స్టాప్ ఎప్పుడు పడుతుంది? అనే ప్రశ్న కామన్ ఆడియన్స్ లో ఉంది.
బన్నీ వాస్ చెప్పినట్టు ప్రతి సంక్రాంతికి తన ఫ్యామిలీని తీసుకుని చిరంజీవి గారు బెంగళూరు వెళ్తారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుంటారు. అలాగే ఫ్యామిలీతో కలిసున్న ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. ‘ఫ్యామిలీ అంతా ఒక్కటే’ అని చాటి చెప్పడానికి చిరు ప్రతి ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు. 2025 సంక్రాంతికి చిరంజీవి ఇంట్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో అల్లు అర్జున్ పాల్గొని, ఆ ఫోటోలు బయటకు వస్తే.. ఇప్పుడు జరుగుతున్న ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదు అంటే ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది.