ఆగస్టు 15కి ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ ఉన్నట్టా..లేనట్టా?

‘బాహుబలి’ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ చిత్రం. రాంచరణ్, ఎన్టీఆర్ లు తరువాత షెడ్యూల్ కోసం డిఫరెంట్ గెటప్పుల్లోకి మారారట. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చరణ్… కొమరం భీమ్ గా తారక్ కనిపించబోతున్నారు. ఈ క్రమంలో ‘స్వాతంత్ర్య దినోత్సవం’ ఆగష్టు 15 సందర్బంగా ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబందించి ఏదైనా ఆసక్తికర అప్డేట్ ఉండబోతుందా అనే… ఆసక్తి ఇద్దరి హీరోల అభిమానుల్లోనూ నెలకొంది. .

ఇద్దరూ స్వాతంత్య్ర సమర యోధులు కాబట్టి ఇద్దరి లుక్స్ విడుదల చేస్తారా.. ? లేక ఒక్క హీరో లుక్ మాత్రమే విడుదల చేస్తారా అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా దేశభక్తి నేపధ్యంలో సాగే కథాంశం కాబట్టి కచ్చితంగా ఏదో ఒక అప్డేట్ రాజమౌళి ఇస్తాడని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి అటు రాజమౌళి కానీ ఇటు నిర్మాత దానయ్య కానీ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అప్డేట్ ఉండదేమో అని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు. ఇదిలా ఉండగా అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus