సినిమా అనౌన్స్ చేశాక ఆగిపోతున్న సంఘటనలు ఈ మధ్య టాలీవుడ్లో తరచుగా జరుగుతున్నాయి. అంతా ఆలోచించుకోకుండా సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారా అనే డౌట్ వచ్చేలా కొన్ని సినిమాలు ప్రకటన తర్వాత పట్టాలెక్కడం లేదు. చిరంజీవి – వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య, రవితేజ – గోపీచంద్ మలినేని – మైత్రీ మూవీ మేకర్స్… ఇలా లిస్ట్ చెప్పుకుంటే కొన్ని సినిమాలు వస్తాయి. సాయిధరమ్ తేజ్ – సంపత్ నంది – సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా కూడా ఈ లిస్ట్‌లో చేరుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
సాయితేజ్ – సంపత్ నంది కాంబినేషన్లో ‘గాంజా శంకర్’ అనే సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తారని చెప్పారు కూడా. అంతేకాదు ఈ సినిమా కోసం సాయి తేజ్‌కు రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా ఏకంగా ఆగిపోయింది అని అంటున్నాఉ. కారణాలు కొన్ని ఉన్నాయి అంటూ ఆ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘గాంజా శంకర్’ (Ganja Shankar) సినిమాను రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించాలని టీమ్ ప్లాన్ చేసుకుందట. దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా షురూ చేశారు. అయితే బడ్జెట్ పెరిగి, పెరిగి చివరికి రూ.75 కోట్లకు చేరిందని అంటున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో, మార్కెట్ బట్టి అంత బడ్జెట్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లడం సరికాదని నిర్మాణ సంస్థ అనుకుంటోందట. దీంతో ఆ సినిమా స్థానంలో మరో సినిమా చేస్తారని టాక్.
మామూలుగా పూర్తిగా ప్రాజెక్ట్ పక్కనపెట్టేయాలి, అయితే సాయితేజ్‌కు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసిన నేపథ్యంలో మరో కథతో రూ.40 కోట్ల బడ్జెట్లో సినిమా చేయాలని అనుకుంటున్నారట. డిజిటల్, శాటిలైట్, ఓటీటీ మార్కెట్ లెక్కలేసుకుంటే ఆ బడ్జెట్ బెటర్ అని నిర్మాణ సంస్థ అనుకుంటోంది అని టాక్. మరి ఇప్పుడు ఏ కథ, ఎవరితో చేస్తారో చూడాలి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తారట.