ప్రభాస్‌తో పాటు నటించే అవకాశం రావడంతో ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఒక్కసారిగా టాప్ లిస్టులో చేరిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియాడిక్ డ్రామా “ఫౌజీ”లో ఆమె హీరోయిన్‌గా ఎంపిక కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ సరసన నటించడం ఇమాన్వికి మొదటి సినిమాయే అయినా, ఈ అవకాశంతో ఆమెకి ఎంతోమంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఫౌజీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వేరే చిత్రాలు చేయకూడదని ఒప్పందం పెట్టిందని టాక్. కానీ బాలీవుడ్‌కు చెందిన టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, ఇమాన్విని తమ కొత్త ప్రాజెక్ట్‌కు కన్‌ఫర్మ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట.
కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఇమాన్వి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఫౌజీ నిర్మాత భూషణ్ కుమార్, అనురాగ్ బసు జట్టు ఒకేసారి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇమాన్వి పేరుతో ముంబైలో ఇప్పటికి చర్చలు మిన్నంటున్నాయి.
అనుభవం తక్కువగా ఉన్నా, ఆమె సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, డాన్స్ వీడియోలు, లుక్స్ చూసి బాలీవుడ్ నిర్మాతలు ఆమెపై నమ్మకం పెట్టుకుంటున్నారట. ఇక ఫౌజీ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో, ఇమాన్వి పర్యవేక్షణలో ఆమె క్యారెక్టర్ డెవలప్‌మెంట్ జరుగుతోందని టాక్. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో ఇమాన్వి భవిష్యత్‌లో కీలకమైన ఛాయిస్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రష్మిక, శ్రీలీల తరువాత ఇమాన్వి ఇస్మాయిల్ పేరుతో టాలీవుడ్ కొత్త హీరోయిన్ లిస్ట్‌లో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అమ్మడి కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.