పేమెంట్‌ ఆపేయడం వల్లే చైతన్య చనిపోయాడు!

చైతన్య మాస్టర్‌.. టీవీ షోలు చూసేవాళ్లకు ఈ పేరు బాగా సుపరిచితమే. ఇంకాస్త సులభంగా గుర్తుకు రావాలంటే పొట్ట చైతన్య మాస్టర్‌ అంటే చాలు. తన డ్యాన్స్‌లు ఎంత ఫేమసో, అందులో అతని పొట్ట స్టెప్పులు అంతే ఫేమస్‌. అలాంటి మాస్టర్‌ మొత్తం అభిమానుల్ని విషాదంలో ముంచెత్తి కన్నుమూశారు. అయితే ఆయన మృతికి కారణం ఓ ఈవెంట్‌ అని సమాచారం. ఈ విషయంలో అతని సన్నిహితుల నుండి వేరే మాటలు వినిపిస్తున్నా.. ఆయనతో కలసి ఆ ఈవెంట్‌లో పాల్గొన్న లేటెస్ట్‌ వైరల్‌ డ్యాన్సర్‌ కండెక్టర్‌ ఝాన్సీ అయితే అదే కారణం అని చెబుతున్నారు.

చైత‌న్య మాస్ట‌ర్ నెల్లూరులో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. అయితే అంత‌కుముందు ఆయ‌న ‘అప్పుల బాధ భ‌రించ‌లేక ఆత్మహ‌త్య చేసుకుంటున్నా’ అంటూ ఓ వీడియో తన స్నేహితులకు పంపించారు. అందులో ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో చైత‌న్య మాస్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌పై కండెక్ట‌ర్ ఝాన్సీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైరల్‌గా మారాయి. ‘‘ఆయ‌న అంద‌రితో ఒక‌సారి కూర్చుని మాట్లాడి ఉండుంటే ఇంత దీనమైన ప‌రిస్థితి రాక‌పోయుండేది. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల అమ్మ‌, నాన్న‌, చెల్లి బాధ‌ప‌డుతున్నారు’’ అని అన్నారామె.

డ‌బ్బులు ఇవ్వ‌లేక చ‌చ్చిపోవాల‌నిపిస్తుంద‌ని అని ఆయన సన్నిహితులకు, తనతో ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న వారికి చెప్పి ఉండుంటే ఇంత బాధాక‌ర‌మైన ప‌రిస్థితి వ‌చ్చుండేది కాదు అని ఝాన్సీ చెప్పారు. డిసెంబ‌ర్ 31న నిర్వహించిన ఓ ప్రోగ్రామ్‌లో కొంత మంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండిచ్చారట. దాంతో ఆ క‌మిటీ వాళ్లు మాస్ట‌ర్‌కు రావాల్సిన డబ్బులను ఆపేశారు. రూ. ఆరేడు ల‌క్ష‌ల ఉంటుంది ఆ డబ్బు. దాని వ‌ల్ల ఆయన అపక్పులు చేసుంటారు అని ఆమె చెప్పారు.

అనుకున్న వాళ్లు రాక‌పోవ‌టంతో ఈవెంట్‌ కమిటీ వాళ్ల‌కు లాస్ వ‌చ్చింది. దాంతో మాస్ట‌ర్‌కు పేమెంట్ ఆపేసినట్లున్నారు. అయితే ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌టం కోసం అప్పులు తెచ్చి మరీ మాస్టర్‌ పేమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఇబ్బందితో ఇలా చేసి ఉండొచ్చు అని ఆమె అన్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus