ఇండియన్ సినిమాలో ఓ స్టార్ హీరో టాక్ షోను హోస్ట్ చేయడం కొత్త కాదు. స్టార్ హీరోలు చాలామంది ఓటీటీలకు వచ్చి షోలు చేస్తున్నారు. సీనియర్ హీరోలు, యువ హీరోలు కూడా కొన్ని షోలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా టాప్ ప్లేస్‌లో ఉన్న చిరంజీవి లాంటి హీరో టాక్ షో చేయడం, అందులో 192 దేశాల్లో ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో చేస్తుండటంతో ఇప్పుడు ఆ షో మీద అంచనాలు పెరిగాయి.
ఇప్పటివరకు అయితే చిరంజీవి టాక్ షో గురించి ఎక్కడా అధికారిక సమాచారం అయితే లేదు కానీ ఉన్న ఇన్ఫో ప్రకారం అయితే ఈ షోకి ‘మెగా వర్స్’ అనే పేరు పెట్టారట. దీనికి సంబంధించి ఓ ఎపిసోడ్ షూటింగ్ కూడా చేశారని వార్తలొచ్చాయి. అదేంటి తొలి ఎపిసోడ్ అంటున్నారు కదా.. అంటే ఇప్పుడు రెండో ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది అని వార్తలొస్తున్న హీరోతో పోలిస్తే.. తొలి ఎపిసోడ్‌కి వచ్చిన నటుల ఎపిసోడ్‌ను ఓపెనింగ్ ఎపిసోడ్‌కి తీసుకోకపోవచ్చు అనిపిస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు ‘మెగా వర్స్’ టాక్ షోకి రెండో ఎపిసోడ్ కోసం వచ్చింది లోక నాయకుడు కమల్ హాసన్. అవును అన్నీ అనుకున్నట్లుగా జరిగి, వచ్చిన రూమర్లు నిజమైతే చిరంజీవి – కమల్ హాసన్ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం మనం త్వరలో చూస్తాం. ఈ ఎపిసోడ్‌కి ఎందుకంత క్రేజ్ అంటే.. చిరంజీవి, కమల్ హాసన్ కాంబో ఇప్పటిది కాదు. 1979లో కె బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’ సినిమాలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఆ తర్వాత ఇప్పటివరకు లేదు.
సినిమాలు, అవార్డులు, సభల్లో ఇద్దరూ కనిపించడం తప్ప.. స్క్రీన్ షేర్ చేసుకున్నది మాత్రం లేదు. ఇప్పుడు ఈ టాక్ షో కాసేపు ఇద్దరూ ఒకే స్క్రీన్‌లో కనిపిస్తారు. అంతేనా అంటే ఆ రోజుల్లో వారు చేసిన అల్లర్లు, పడ్డ కష్టాలు, అనుభవించిన వేదనలు, నాటి తీపి ముచ్చట్లు చెబుతున్నారు. దీని కోసమే కమల్ హైదరాబాద్ వచ్చారు అని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. తొలుత షూట్ చేసిన ఎపిసోడ్ సంగతి చూస్తే.. బ్రహ్మానందం- సునిల్ – సత్యతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ఎపిసోడ్ షూట్ చేశారట.