Bimbisara Movie: కళ్యాణ్‌రామ్‌ కొత్త సినిమా వెనుక ఇంత జరిగిందా?

‘బింబిసార’ అంటూ… ఇటీవల కల్యాణ్‌ రామ్‌ సినిమా పోస్టర్‌ వచ్చింది చూశారా? భలే ఉంది కదా… హీరో కళ్లలో రౌద్రం, చుట్టూ శవాల గుట్ట, పైన అధినాయకుడిలా కత్తి పట్టి కూర్చున్న కళ్యాణ్‌రామ్‌… సూపర్‌ అంటే సూపర్‌ అసలు. అయితే ఆ కత్తి పట్టుకొని కూర్చుండే అవకాశాన్ని ముగ్గురు హీరోలు మిస్‌ అయ్యారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అందులో ఇద్దరు యంగ్‌ హీరోలు కాగా, ఇంకొరు హిట్‌ కోసం కష్టాలు పడుతున్న హీరో అట.

దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని మల్లిడి వేణు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం అల్లు శిరీష్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ చేశారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. బడ్జెట్ సమస్యలే కారణమని అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత నితిన్, రామ్ లాంటి యువ కథానాయకులకు ఇప్పటికే కథలు చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టులు ఏవీ వర్కౌట్‌ కాలేదు.

వందల ఏళ్ల నాటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేయాలని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ బడ్జెట్‌ తదితర కారణాల రీత్యా సినిమా ఆపేశారు. ఆ తర్వాత మల్లిడి వేణు.. డెబ్యూ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ‘బింబిసార’ రూపంలో కళ్యాణ్ రామ్ హీరోగా ప్రాజెక్ట్ ఓకే అయింది. అయితే మల్లిడి వేణు… వశిష్ట్‌గా మారిపోయారు అనుకోండి.

అప్పుడు శిరీష్‌ చెప్పిన సినిమా, ‘బింబిసార’ ఒక్కటేనా అనే డౌటానుమానం కలగకమానదు. ఈ సినిమా రషెష్‌ను చూసిన కొందరైతే… సినిమా కచ్చితంగా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుందని అంటున్నారు. గతంలో శిరీష్‌కు చెప్పిన సినిమా కథ పోలికలు ఇందులోనూ ఉన్నాయని అంటున్నారు. అయితే అదీ, ఇదీ ఒక్కటేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై సినిమా విడుదలలోపు క్లారిటీ వస్తుందేమో చూద్దాం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus