Balakrishna: ఆ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్న బాలయ్య..?

స్టార్ హీరో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఈ సినిమాలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు ‘రామారావుగారూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమాలో బాలకృష్ణ పేరు రామారావు అని గ్రామంలోని ప్రజలంతా ఆప్యాయతతో బాలకృష్ణను రామారావుగారూ అని పిలుస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తుండగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఇప్పటికే కథను సిద్ధం చేశారని త్వరలోనే బాలకృష్ణకు కథ వినిపించి ఓకే చేయించుకోనున్నారని సమాచారం. ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే బాలకృష్ణ సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ జులై నుంచి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.

క్రాక్ తరువాత గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. అయితే బాలయ్య మాత్రం తన భవిష్యత్ ప్రాజెక్ట్ ల కోసం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లనే ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు అఖండ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus