Ram Charan: రామ్‌చరణ్‌ కోసం మరో షార్ట్‌ నేమ్‌ రెడీ.. సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

  • March 10, 2023 / 03:26 PM IST

పొట్టి పేరు.. గట్టి హిట్‌ అంటూ ఈ మధ్యే మనం ఓ హిట్‌ కాన్సెప్ట్‌ గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతూ రామ్‌చరణ్‌ సినిమాకు శంకర్‌ ఓ టైటిల్‌ ఫిక్స్‌ చేశారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రామ్‌చరణ్‌ – కియారా అడ్వాణీ జంటగా దిల్‌ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు ఇదే అంటూ గత రెండు రోజులుగా ఓ పేరు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు ఈ మేరకు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ కూడా అయిపోయింది అంటున్నారు.

ప్రభుత్వ అధికారి.. ప్రజల కోసం ప్రభుత్వం మీద ధ్వజమెత్తితే అనే కాన్సెప్ట్‌తో శంకర్‌ – చరణ్‌ సినిమా రూపొందుతోందని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు షూటింగ్‌లో కొన్ని సీన్స్‌ అలానే ఉన్నాయి అని కూడా అంటున్నారు. రాజకీయం, నాయకుల ఆలోచనలు కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో షూటింగ్‌ జరిపినప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఈ విషయం తెలిసిందే. ఇలా మొత్తంగా రాజకీయం, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా కథకు CEO అనే పేరు పెట్టారని సమాచారం.

ఉగాది – రామ్‌చరణ్‌ పుట్టిన రోజు వారంలో సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్ రిలీజ్‌ చేస్తారని సమాచారం. మార్చి 22న ఉగాది ఉంది, 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు. ఆ సమయంలోనే సినిమా లుక్స్‌ రిలీజ్‌ అని అంటున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇలాంటి షార్ట్‌ ఫామ్‌ టైటిల్‌ అయితే క్యాచీగా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే CEO పూర్తి పేరు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడు అని వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఆ అధికారి పాత్ర చీఫ్‌ ఎలక్టోరియల్‌ ఆఫీసర్‌ అవ్వొచ్చు అని అంటున్నారు. ఆ పదవిని CEO అనే అంటారు. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు 50 శాతం పూర్త‌య్యిందని సమాచారం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus