Ram Charan, Buchi Babu: రాంచరణ్ – బుచ్చిబాబు.. ఆ టైటిల్ కే ఫిక్స్ అయిపోయారా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  అభిమానులు అనుకున్న స్థాయిలో మెప్పించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ విషయంలో దర్శకుడు శంకర్ (Shankar)  , సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman), నిర్మాత దిల్ రాజు(Dil Raju)… వంటి వారు మా తప్పు లేదు అంటే మా తప్పు లేదు అంటూ.. పక్కవాళ్ళ మీదకి తోసేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ విషయంలో ఏమీ స్పందించకుండా..’తానే తప్పు చేసినట్టు’ వ్యవహరిస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టి.. దాని కోసం కష్టపడుతున్నాడు.

Ram Charan, Buchi Babu

is This Title fixed For Ram Charan , Buchi Babu Combo Movie (1)

దానికి ‘ఉప్పెన’ (Uppena)  ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu Sana)  దర్శకుడు. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్నాడు. ‘మైత్రి’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.రాంచరణ్ 16వ సినిమాగా తెరకెక్కుతున్న ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం ‘పెద్ది’ (RC 16 Movie)   అనే టైటిల్ అనుకుంటున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ‘దీనికి పాన్ ఇండియా అప్పీల్ లేదేమో అని భావించి’ నిర్మాతలు ఇప్పటివరకు సంకోచిస్తూ వచ్చారు.

కానీ ఫైనల్ గా దీనికే ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఇందులో హీరో పాత్ర పేరు పెద్దిరాజు అట. అందరూ పెద్ది అని పిలుస్తారు. ఆంధ్రా సైడ్ జనాల్లో చాలా మందికి ఈ పేరు ఉంటుంది. ‘పేరు’ కి అర్థాలు వేరుగా ఏమీ ఉండవు. అందుకే అన్ని భాషల్లోనూ సెట్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన. మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు. కాబట్టి.. ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్, గ్లింప్స్ వదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

5 నిమిషాల పాత్రకి అన్ని కోట్లు ఇచ్చారా…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus