Toxic: ‘టాక్సిక్‌’ చేతులు మారుతోందా? యశ్‌ ఏం చేయబోతున్నాడు?

మొన్నీమధ్య ఓ అగ్ర హీరో – కన్నడ బేస్‌ అగ్ర దర్శకుడు మధ్య చిన్నపాటి చర్చలు జరుగుతున్నాయని.. దాంతో ఓ పెద్ద సినిమా షూటింగ్‌ హోల్డ్‌లో పడింది అని మాట్లాడుకున్నాం. ఆ విషయంలో క్లారిటీ రాకుండానే మరో అగ్ర హీరో – మహిళా దర్శకురాలి సినిమా గురించి చర్చ మొదలైంది. అవుట్‌పుట్‌ విషయంలో హీరో హ్యాపీగా లేడని.. మరోసారి డైరక్షన్‌ టీమ్‌తో కూర్చుని చర్చించుకుందాం అంటున్నాడు అని వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి సినిమా ఇక్కడిది కాదు. కన్నడ నాటదే.. అయితే మలయాళ దర్శకురాలు కెప్టెన్‌.

Toxic

ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ సినిమా ఏంటో. అవును మీరు అనుకుంటున్నది.. హెడ్డింగ్‌లో చెప్పిందే ‘టాక్సిక్‌’. ‘కేజీయఫ్‌’ సినిమాల తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకొని యశ్‌ ఓకే చేసి పట్టాలెక్కించిన చిత్రం ‘టాక్సిక్‌’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా టీమ్‌ స్పీడ్‌ చూస్తుంటే అలా అనిపించడం లేదు అనేది సినిమా వర్గాల మాట. ఎందుకంటే సినిమాకు కంటిన్యూస్‌ హాల్ట్‌లు తగులుతున్నాయట.

‘టాక్సిక్’ సినిమా నుండి ఇప్పటికే ఒక చిన్న టీజర్ వదిలారు. అయితే దానికి అంతటి మంచి రెస్పాన్స్‌ రాలేదు. ‘కేజీయఫ్‌’ ఫ్రాంచైజీతో సూర్‌ మాస్ ఇమేజ్ తెచ్చుకున్న యశ్‌ నుండి అంతకుమించిన మాస్‌ సినిమాను ప్రేక్షకులు, అభిమనులు ఆశిస్తున్నారు. ఈ సమయంలో సినిమా రషెష్‌ చూసిన టీమ్‌.. రీషూట్ల మీద రీషూట్లు చెబుతోందట, చేస్తందట. క్వాలిటీ ఇష్యూలు అని కొందరు అంటుంటే.. మరికొందరేమో యశ్‌, గీతూ మోహన్‌దాస్‌కు నప్పడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోయిందని చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా కొత్త పుకారు ఒకటి మొదలైంది. అదే ఈ సినిమా దర్శకుడు మారుతారు అని. అయితే ఇది సాధ్యమా అంటే ఏమో సినిమా కంటే ఏదీ గొప్ప కాదు అనుకునే వాళ్లు ఈ పని చేస్తారు. ఈ విషయంలో ఈ నెలాఖరులో క్లారిటీ రావొచ్చు అని చెబుతున్నారు.

నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus