నారా వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నారా రోహిత్ – శిరీష(సిరి లెల్ల) పెళ్లి పనులు ఘనంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.అతి త్వరలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో కలిపి 4 రోజుల పాటు నారా రోహిత్- శిరీష..ల వివాహం జరగనుంది.అక్టోబర్ 25 నుండి హైదరాబాద్‌లో హల్దీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 26న పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం.
టోబర్ 28న స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మెహందీ వేడుకలు ఉంటాయి. అక్టోబర్ 30న రాత్రి పెళ్ళి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. రోహిత్- శిరీష..ల వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇక 2024 అక్టోబర్లో నారా రోహిత్,శిరీష..ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత వెంటనే పెళ్ళి డేట్ అనౌన్స్ చేయకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొత్తానికి అక్టోబర్ 30న నారా రోహిత్ పెళ్ళి జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది.
నారా రోహిత్ సినిమాల విషయానికి వస్తే.. అతను ఇటీవల ‘సుందరకాండ’ సినిమాతో సందడి చేశాడు. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.దీనికి ముందు ‘భైరవం’ అనే సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. దానికి కూడా మంచి ఆదరణ లభించింది. ఇక నారా రోహిత్ రీ ఎంట్రీ సినిమా గత ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యింది. అదే ‘ప్రతినిధి 2’. ఈ సినిమాలో నారా రోహిత్ కు జోడీగా శిరీష(సిరి లెల్ల) నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు స్పష్టమవుతుంది.