త్వరలోనే ఆంధ్రాలో ఎలక్షన్స్ జరగనున్నాయి. వచ్చే నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బాలయ్య స్వయంగా నటించి నిర్మించిన “ఎన్టీఆర్ మహానాయకుడు”, రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ ఎన్టీఆర్ బయోపిక్స్ కావడం గమనార్హం. అయితే.. ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ ను చూపించనున్నారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ ను ఆయన కుమారులందరూ దూరం పెట్టిన విషయం తెలిసిందే.
సో, వర్మ ఎలాగూ పచ్చిగా “లక్ష్మీ పార్వతి”ని పెళ్లి చేసుకోవడం వలనే ఎన్టీఆర్ కు బాలయ్య దూరమయ్యాడని చూపించేశాడు. క్రిష్ ఎలాగూ అలా చూపించలేడు కాబట్టి ఏదో కాస్త సెన్సిబుల్ గా డీల్ చేసినా రీజన్ మాత్రమే అదే ఉంటుంది. సో.. ఈ రెండు సినిమాల్లోనూ బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ కు దూరమవ్వడం మాత్రం ఉండి తీరుతింది. సో, జనాల్లో బాలయ్య మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటి హిందూపూర్ లో గనుక బాలయ్య ఓడిపోకపోయినా.. మెజారిటీ తగ్గినా కూడా అది తప్పకుండా ఈ రెండు సినిమాల ఎఫెక్టే అయ్యి తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.