తెలంగాణలో ఈశా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి పోటీలు:ఆదివారం, 10 సెప్టెంబర్

నమస్కారం, ఈశా గ్రామోత్సవం రాష్ట్ర (డివిజినల్) స్థాయి పోటీలు సెప్టెంబర్ 10న ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారంలో జరగనున్నాయి. 2004 నుండి ఈశా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవమే ఈశా గ్రామోత్సవం. క్రీడలను గ్రామీణుల జీవితంలో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలు ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు. సాధారణ గ్రామీణులకు ఆటలో భాగమై, ఆడడంలో ఉన్న సంతోషాన్ని రుచి చూపించడమే దీని ప్రత్యేకత.

ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని అయిదు రాష్ట్రాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 3 స్థాయిల్లో నిర్వహిస్తున్నారు – జిల్లా, డివిజినల్ ఇంకా ఫైనల్స్. ఫైనల్స్ కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో నిర్వహిస్తారు. తెలంగాణలో 9 జిల్లాల నుండి జిల్లా స్థాయి పోటీలకు 227 వాలీబాల్ & 119 త్రోబాల్ టీం లతో అద్భుతమైన స్పందన లభించింది.సుమారు 2700 ఆటగాళ్ళు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

తెలంగాణలోని 9 జిల్లాల విన్నర్ లు ఇంకా రన్నర్ లు పాల్గొనే ఈ ఉత్సాహభరిత పోటీలకు మీ అందరినీ ఈ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

తేదీ: సెప్టెంబర్ 10,2023, ఆదివారం

సమయం:పోటీలు ఉ.9 నుండి,

ముగింపు కార్యక్రమం : 4 PM నుండి 5:30PM వరకు

స్థలం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్,నాచారం

శ్రీమతి కొర్ర లక్ష్మి,ఐఏఎస్,డైరెక్టర్,SATSగారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
96189 54075

ప్రణామం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags