ఇప్పటికీ స్టడీగా ఉన్న ‘ఇస్మార్ట్ శంకర్’

  • August 1, 2019 / 06:49 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం అనుకున్న దానికన్నా పెద్ద విజయాన్నే నమోదుచేసింది. జూలై 18 న విడుదలైన ఈ చిత్రం.. నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి… మొదటి వారానికే సూపర్ హిట్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ‘డియర్ కామ్రేడ్’ వంటి క్రేజీ చిత్రం వస్తుంది కదా.. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు డౌన్ అవుతాయని అంతా అనుకున్నారు. అయితే ఆ చిత్రం ప్రభావం ‘ఇస్మార్ట్ శంకర్’ పై పెద్దగా పడలేదనే చెప్పాలి. ఇప్పటికి ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కలెక్షన్లు స్టడీ గా ఉన్నాయి. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ 14 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 13.61 కోట్లు
సీడెడ్ – 5.25 కోట్లు
వైజాగ్ – 3.59 కోట్లు


ఈస్ట్ – 1.86 కోట్లు
కృష్ణా – 1.87 కోట్లు
గుంటూరు – 1.89 కోట్లు


వెస్ట్ – 1.60 కోట్లు
నెల్లూరు – 1.03 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 30.07 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 2.37 కోట్లు
యూ.ఎస్.ఏ – 0.63 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 33.7 కోట్లు (షేర్)
——————————————————

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లు జరిగింది. 2 వారలు పూర్తయ్యేసరికి 33.7 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. ఇప్పటికి ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండడం విశేషం. అందులోనూ బి,సి సెంటర్స్ లో ఈ చిత్రం ఇప్పటికీ మంచి కల్లెక్షన్లని నమోదుచేస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని కొన్న ప్రతీ డిస్ట్రిబూస్టర్ లాభాల బాట పట్టాడు. రామ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ కలెక్షన్స్… ఇక చాలా రోజుల తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మంచి హిట్టందుకున్నాడు. ‘టెంపర్’ లాంటి హిట్టున్నప్పటికీ… ‘బిజినెస్మేన్’ లాంటి బ్లాక్ బస్టర్ మాత్రం… ‘ఇస్మార్ట్ శంకర్’ తోనే అందుకున్నాడని చెప్పాలి. ఫుల్ రన్ లో ఈ చిత్రం 35 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైనదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus