డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఇస్మార్ట్ శంకర్’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం అనుకున్న దానికన్నా పెద్ద విజయాన్నే నమోదుచేసింది. జూలై 18 న విడుదలైన ఈ చిత్రం.. క్లోజింగ్ కలెక్షన్లు బయటకి వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ వంటి క్రేజీ చిత్రం వచ్చినా ఆ పోటీని తట్టుకుని .. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 13.86 కోట్లు
సీడెడ్ – 5.70 కోట్లు
వైజాగ్ – 4.05 కోట్లు


ఈస్ట్ – 2.30 కోట్లు
కృష్ణా – 2.0 కోట్లు
గుంటూరు – 1.95 కోట్లు


వెస్ట్ – 1.75 కోట్లు
నెల్లూరు – 1.05 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 32.65 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 1.90 కోట్లు
ఓవర్సీస్ – 1.0 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 35.55 కోట్లు (షేర్)
——————————————————

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లు జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 35.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు రెండింతల లాభాలు వచ్చాయన్న మాట. ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. ‘టెంపర్’ లాంటి హిట్టున్నప్పటికీ… ‘బిజినెస్మేన్’ లాంటి బ్లాక్ బస్టర్ మాత్రం… ‘ఇస్మార్ట్ శంకర్’ తోనే అందుకున్నాడు పూరి.ఈ చిత్రంతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన పూరి ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus