ప్లాపుల్లో ఉన్న ఓ డాషింగ్ డైరెక్టర్ కి ఎనర్జిటిక్ హీరో దొరికితే ఏ రేంజ్ హిట్టు కొట్టగలడనేది పూరి జగన్నాథ్ మరోసారి ప్రూవ్ చేశాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఆయన తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం జూలై 18 న విడుదలైంది. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సో.. సో సినిమాలతో లాగించేస్తున్న రామ్,పూరి లు… ఈ చిత్రంతో మంచి మాస్ హిట్టు కొట్టారు. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అంతేకాదు వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ సాధించింది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం. తెలంగాణ యాసతో.. రామ్ ను ఊర మాస్ గా చూపించాడు పూరి. దీంతో మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం ఇరక్కొట్టేస్తుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 11 కోట్లు
సీడెడ్ – 4.20 కోట్లు
వైజాగ్ – 2.98 కోట్లు
ఈస్ట్ – 1.62 కోట్లు
కృష్ణా – 1.33 కోట్లు
గుంటూరు – 1.67 కోట్లు
వెస్ట్ – 1.33 కోట్లు
నెల్లూరు – 0.83 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 25.22 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 1.55 కోట్లు
ఓవర్సీస్ – 0.90 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 27.67 కోట్లు (షేర్)
——————————————————
‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లు జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి 27.67 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని కొన్న ప్రతీ డిస్ట్రిబూస్టర్ లాభాల బాట పట్టాడు. రామ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ కలెక్షన్స్… ఇక చాలా రోజుల తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి హిట్టందుకున్నాడు. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. కానీ రేపటి నుండీ అంటే.. జూలై 26 న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం రాకతో ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.