ఈ మధ్య స్టార్ హీరోల ఫ్యాన్స్ కు కలెక్షన్లు, రికార్డులు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. టీజర్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ట్రైలర్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతమంది చూసారు… ఇక సినిమా మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి చాలవు అన్నట్టు బుల్లితెర టిఆర్పీ లను కూడ రికార్డులుగా చెప్పుకుంటున్నారు. ఏ పండగ రోజునో.. పెద్ద సినిమాల్ని టెలికాస్ట్ చేస్తే.. వచ్చే టిఆర్పి లను సైతం రికార్డులుగా చెప్పుకుని నెట్టింట్లో సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఆలా రాంచరణ్ సినిమాపై రామ్ సినిమా పైచేయి సాధించిందట.
రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ అలాగే రామ్ ల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఒకే రోజున టీవీల్లో ప్రసారమవ్వగా.. ‘ఇస్మార్ట్ శంకర్’ కు 16 టీఆర్పీ వచ్చింది. ఇక ‘వినయ విధేయ రామా’ చిత్రానికి 8 టి.ఆర్.పి మాత్రమే వచ్చింది. దీంతో రాంచరణ్ సినిమాకు రామ్ సినిమా సెటైర్ వేసింది అంటున్నారు. అయితే అది కరెక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ‘వినయ విధేయ రామా’ చిత్రం ఎప్పుడో జనవరి లో వచ్చిన సినిమా. అందులోనూ ప్లాప్ అయ్యింది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు 100 రోజులు కూడా పూర్తవ్వలేదు. అదే ‘రంగస్థలం’ సినిమాకి 19 టి.ఆర్.పి వచ్చింది. అలా అని హిట్టు సినిమాలకే టి.ఆర్.పి వస్తుందా అంటే..? అది కూడా కచ్చితంగా చెప్పలేం. ‘దువ్వాడ జగన్నాథం’ వంటి యావేరేజ్ సినిమాకి కూడా 20 పైనే టిఆర్పీ వచ్చింది. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి 6, ‘మహర్షి’ వంటి హిట్ చిత్రానికి కూడా 9 టి.ఆర్పీ మాత్రమే రావడాన్ని కూడా ఓ సారి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి.