Money Heist: ‘మనీ హెయిస్ట్‌’ వెబ్‌సిరీస్‌ క్రేజ్‌ మామూలుగా లేదు!

చదువుకోవడానికి టైమ్‌ టేబుల్‌ చూసుంటారు… ఆఫీసులో పని చేయడానికి టైమ్‌ టేబుల్‌ చూసుంటారు. అంతేకానీ… వెబ్‌ సిరీస్‌ చూడటానికి టైమ్‌ టేబుల్‌ ఇవ్వడం చూశారా. అందులో పని చేస్తున్న ఆఫీసే ఆ టైమ్‌ టేబుల్‌ సెట్ చేయడం చూశారా. అంతేకాదు దాని కోసం ఏకంగా ఆఫీసుకే సెలవు ఇవ్వడం చూశారా? అయితే Verve Logic అనే సంస్థ ట్విటర్‌ పేజీకి వెళ్లండి. చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంగ్లీష్‌ వెబ్‌సిరీస్‌ల్లో యువతకు బాగా నచ్చిన వాటలో మనీ హెయిస్ట్‌ ఒకటి.

ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లుగా వచ్చిన ఆలరిస్తోంది. తాజాగా ఐదో సిరీస్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు మూడు నుండి ఈ సిరీస్‌ స్ట్రీమ్‌ అవుతుంది. ఈ నేపథ్యలో ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌ హోం నుండి సెలవు ఇచ్చింది. ఆ సంస్థే Verve Logic. జైపూర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇది. సిరీస్‌ను చూడటానికి ఉద్యోగులు ఆ రోజు ఏదో కారణం చెప్పి సెలవు పెడతారని సంస్థ ముందే ఊహించి సెలవు ప్రకటించింది.

‘నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ చిల్‌ హాలీడ్‌’ అంటూ సెలవు ఇచ్చేసి… మనీ హెయిస్ట్‌లోని ఐదో సిరీస్‌లో ఐదు ఎపిసోడ్లను ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి అంటూ సరదాగా ఓ టైమ్‌టేబుల్‌ కూడా ఇచ్చింది. ఈ మొత్తం విషయాన్ని ట్విట్‌ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటివరకు కొన్ని సినిమాల విడుదల సందర్భంగా ఇలా సెలవులు ఇవ్వడం చూశాం. ఇప్పుడు వెబ్‌సిరీస్‌కు కూడా ఇస్తున్నారన్నమాట.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus