మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న కీర్తి సురేష్..!

‘మహానటి’ అనే ఒక్క చిత్రంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈమె స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసింది కీర్తి సురేష్. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో మాత్రమే నటించిన ఈ బ్యూటీ మరో తెలుగు హీరో పక్కన నటించేందుకు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. అయితే తమిళంలో మాత్రం దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. ఇప్పుడు రమ్యకృష్ణ వంటి సూపెర్ స్టార్ పక్కన కూడా నటించబోతుందనే టాక్ నడుస్తుంది. ఇక తెలుగులో మాత్రం ఈమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ‘మిస్ ఇండియా’ అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్.. తమిళంలో కూడా ‘పెంగ్విన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో .. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపించబోతుంది. కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం కూడా తనకి మంచి పేరు తీసుకొస్తుందని కీర్తి ఎంతో నమ్మకంతో ఉంది.

1

2

3

4

5

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus