బాలీవుడ్ లో సినిమాల విడుదలకు సంబంధించిన పక్కా ప్లానింగ్ ఉంటుంది. సినిమా ప్రకటన వెలువడినపుడే రిలీజ్ డేట్ ఖరారు చేసే సంప్రదాయం అక్కడ ఉంది. స్టార్స్ సినిమాలైనా మిగతా సినిమాల విడుదలను పరిగణనలోకి తీసుకొని వాటికి నష్టం కలగకుండా ఓ తేదీని లాక్ చేస్తారు. దాంతో ఓ వారం రెండు వారాల పాటు ఆ సినిమా కలెక్షన్లకు ఢోకా ఉండదు. మన దగ్గర ఈ మధ్యనే “రెండు వారాల” గ్యాప్ అన్నమాట వినపడుతున్నాయి ఆచరణలోకి ఇంకా రాలేదు. ఈ సంగతి పక్కనపెడితే షారుక్ – హృతిక్ సినిమాల విడుదల విషయమై బాలీవుడ్ లో తర్జన భర్జన జరుగుతోంది.షారుక్ హీరోగా రాహుల్ దొలాకియా తెరకెక్కించిన చిత్రం ‘రాయిస్’. ‘ఫ్యాన్’ సినిమాతోపాటు ఈ సినిమాని షారుక్ పూర్తి చేసి ఇదే ఏడాది విడుదలకు సిద్ధం చేశాడు.
‘ఫ్యాన్’ అనుకున్న తేదీకే విడుదల కాగా సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా కారణంగా ‘రాయిస్’ వాయిదా వేశాడు బాలీవుడ్ బాద్షా. తర్వాత ‘మొహెంజో దారో’ లాంటి పెద్ద సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు అప్పటికే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడంతో షారుక్ వచ్చే ఏడాది జనవరి 16కి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అదే రోజున హృతిక్ నటించిన ‘కాబిల్’ తెరమీదికి రానుంది. దీంతో ఈ వ్యవహారం కాస్త వేడి పుట్టిస్తోంది. ఇక్కడితో షారుక్-హృతిక్ వార్ ముగుస్తుందేమో అనుకుంటే ఇదింకా ముదిరేలా ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించనున్న షారుక్ మరుగుజ్జుగా ఓ ప్రయోగాత్మక పాత్ర చేయనున్నారు. ఈ సినిమా 2018 క్రిస్మస్ ని టార్గెట్ ని చేసిందది. అటు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ‘క్రిష్4’ సినిమాని ప్రకటిస్తూ 2018 క్రిస్మస్ అని బాంబు పేల్చారు. ఈ చిచ్చు ఎలా సద్దుమణుగుతుందో మరి.