ఓ సినిమా ఫలితం.. దర్శకుడిని ఎలా మార్చేస్తుందో మనం ఇండస్ట్రీలో గతంలో చాలాసార్లు చూశాం. అయితే అలాంటి దశ నుండి తిరిగి టాప్ దశకు వెళ్లిన దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పూరి.. తాజా సినిమా ‘లైగర్’తో మళ్లీ తన కెరీర్‌కి జర్క్ వచ్చేలా చేసుకున్నారు. ఈ మాట మేం అనడం లేదు. ‘లైగర్’ సినిమా చూసిన అతని ఫ్యాన్స్, పరిశ్రమ పరిశీలకులే చెబుతున్నారు.
‘లైగర్’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. పాన్ ఇండియా సినిమా రూపొందుతుండటం, ప్రచారంలో ఛార్మి, విజయ్ దేవరకొండ ఇచ్చిన హైప్ చూసి… సినిమా భారీ స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. ప్రచారంలో ‘వాట్ లగా దేంగే’ అంటే.. ఇదేదో బద్దలుకొట్టే సినిమా అని అనుకున్నారు. సినిమా బయటికొచ్చాక చూస్తే.. అందులో విజయ్ పనినతంలో ఏమాత్రం తప్పు లేదని, అంతా దర్శకుడి సమస్యనే అని అంటున్నారు. కాస్టింగ్‌ను, బడ్జెట్‌ను, విజయ్ లాంటి ఎనర్జిటిక్ హీరోను సరిగ్గా వాడుకోలేకపోయారు అని అంటున్నారు.
పూరి జగన్నాథ్ సినిమాలో ఓ రకమైన ఫ్లేవర్ ఉంటుంది. ఆయన హీరో అందరి హీరోల్లా ఉండరు అని అంటుంటారు. గతంలో ఆయన తీసిన సినిమాలు చూస్తే.. ఈ విషయం అర్థమవుతోంది. అంతవరకు ఓ రకమైన హీరోలా ఉండే నటుడు.. పూరి సినిమాలోకి వచ్చేసరికి పూర్తి డిఫరెంట్‌గా మారిపోతాడు. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా హీరో పాత్ర చిత్రణ, కథ, కథనాలు పూరి సినిమాలో కనిపిస్తాయి. అయితే ‘లైగర్’ సినిమాలో ఇవన్నీ మిస్ అయ్యాయి. వన్ లైనర్స్‌తో ఆకట్టుకునే పూరి.. ‘లైగర్’లో హీరోకు నత్తి పెట్టేసి తన పెన్నును తాను కట్టేసుకున్నాడు.
పాన్ ఇండియా అంటూ భారీ కాన్వాస్ పూరికి ఇస్తే.. ఎలాంటి కథను ఎంచుకోవాలి. మొత్తం దేశానికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. లేదంటే హీరోను లార్జర్ ద్యాన్ లైఫ్‌లా ఉండాలి. కానీ ‘లైగర్’ విషయం ఇవన్నీ లేకపోయాయి. పాన్ ఇండియా కాన్వాస్‌పై రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ ఎలా వాడుకున్నారో చూశాం. కానీ సూపర్ ఫాస్ట్ డైరక్టర్ పూరి.. తన సినిమాల విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ‘జేజీఎం’ విషయంలోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?