శర్వానంద్, సమంత.. ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ’96’ చిత్రానికి ఇది రీమేక్ . సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఒరిజినల్ ను తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ తో పాటు మంచి రివ్యూలను కూడా సంపాదించుకుంది. మొదటి 3 రోజులు పర్వాలేదనిపించినా 4 వ రోజు మాత్రం ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ఇక ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.42 cr |
సీడెడ్ | 0.76 cr |
ఉత్తరాంధ్ర | 0.99 cr |
ఈస్ట్ | 0.40 cr |
వెస్ట్ | 0.30 cr |
కృష్ణా | 0.43 cr |
గుంటూరు | 0.53 cr |
నెల్లూరు | 0.19 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.39 cr |
ఓవర్సీస్ | 0.83 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 7.24 cr (share) |
‘జాను’ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.24 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. 4 వ రోజున ఈ చిత్రం కలెక్షన్లు బాగా పడిపోయాయి. మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి కేవలం 0.64 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 13.76 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత రాబడుతుందో చూడాలి.
Click Here For Jaanu Movie Review
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!