Getup Srinu: కమెడియన్ గా కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించిన శ్రీను?

  • January 16, 2024 / 05:20 PM IST

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎన్నో గెటప్స్ వేస్తూ ఏళ్ల తరబడి ప్రేక్షకులను నవ్వించినటువంటి వారిలో గెటప్ శ్రీను ఒకరు. ఈయన సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ తో కలిసి ఎన్నో అద్భుతమైనటువంటి స్కిట్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందినటువంటి గెటప్ శ్రీను ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి శీను వెండితెరపై ఎంతో బిజీ అయ్యారు. ఈయన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి హనుమాన్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఈ స్థాయిలో ఉన్నారు అంటే జబర్దస్త్ కార్యక్రమం కారణమని చెప్పాలి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గెటప్ శ్రీను తన ఆస్తుల గురించి పలు విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి శీను హైదరాబాదులో సొంత ఇల్లు కారు కొనుగోలు చేసి బాగా స్థిరపడ్డారని తెలుస్తుంది. ఇక తన ఆస్తుల గురించి గెటప్ శ్రీను ఒక సందర్భంలో తెలియజేస్తూ తనకు హైదరాబాదులో సొంత ఇల్లు కార్లు ఉన్నాయని తెలిపారు. అయితే అవన్నీ కూడా కోట్లలో విలువ చేసేవి కాదని ఈయన తెలిపారు.

తాను ఉండటానికి సొంత ఇల్లు ఉందని తిరగడానికి సొంత కారు ఉందని అయితే వీటికి తాను ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని తెలిపారు.. ఉన్నంతలోనే తాను హ్యాపీగా ఉన్నానని తెలిపారు.పెద్ద పెద్ద కమిట్మెంట్స్ పెట్టుకుంటే నిద్ర పట్టదు. అంతకంటే దరిద్రం ఉండదు. ఉదయాన్నే ప్రశాంతంగా లేచేలా జీవితం ఉండాలి. అలాగే తాను బ్రతుకుతున్నాను అంటూ శ్రీను (Getup Srinu) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus