Raghu: వైరల్ అవుతున్న జబర్దస్త్ రఘు షాకింగ్ కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులలో కమెడియన్ రఘు కారుమంచి ఒకరు. సినిమాల ద్వారా, జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రఘుకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ యాసలో రఘు కారుమంచి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రఘు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రఘు కారుమంచి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణమని తారక్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

నా కెరీర్ ఈ స్థాయికి రావడానికి రాజీవ్ కనకాల కారణమని ఆయన అన్నారు. రాజీవ్ లాంటి గొప్ప వ్యక్తి ఫ్రెండ్ గా దొరకడం లక్ అని రఘు అన్నారు. ఎన్టీఆర్ కూడా అంతేనని రాజీవ్, తారక్ అంటే ఎంతో ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ఏది చేయమన్నా చేస్తానని ఆయన అడిగితే వెనుకాడనని రఘు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ నా శరీరంలో పార్ట్ గా మిగిలిపోయారని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావడం పక్కా అని రఘు పేర్కొన్నారు.

తారక్ కు ఆ సత్తా ఉందని రఘు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నన్ను పెద్దన్న అని పిలుస్తారని తారకరత్న మరణం నన్ను బాధ పెట్టిందని రఘు కామెంట్లు చేశారు. నాకు ఆస్తులు లేవని ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నానని ఆయన అన్నారు. లైఫ్ అంటే సిటీ రోడ్లు అని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని రఘు కామెంట్లు చేశారు. సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో నేను పని చేయలేదని రఘు అన్నారు.

రఘు చేసిన కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేశాయి. రఘు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రఘును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus