Rohini: మరో ఖరీదైన కారు కొన్న రోహిణి.. ఎన్ని రూ.లక్షలంటే?

ప్రముఖ కమెడియన్, సీరియల్ నటి రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాలలో కూడా రోహిణి నటించగా ఆమె రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ రోహిణికి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ను మరింత పెంచింది. బిగ్ బాస్ సీజన్3 కంటెస్టెంట్ గా కూడా రోహిణి ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.

తాజాగా రోహిణి కొత్త కారును కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రోహిణి కారును కొనుగోలు చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా ఈ కారు ఆమె కొనుగోలు చేసిన మూడో కారు కావడం గమనార్హం. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. మొదటి కారు యాక్సిడెంట్ లో దెబ్బ తినగా రెండో కారును ఈ మధ్యే అమ్మేశానని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారును కొనుగోలు చేశానని రోహిణి చెప్పుకొచ్చారు.

కియో స్టెల్లోస్ జీటీఎస్ ప్లస్ కారును ఆమె కొనుగోలు చేయడం గమనార్హం. మొదటి కారును 9 లక్షల రూపాయలకు, రెండో కారుకు 14 లక్షల రూపాయలకు కొనుగోలు చేశానని మూడో కారు కోసం మాత్రం ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశానని రోహిణి వెల్లడించారు. ఆడి కారును కొనుగోలు చేయాలని ఫీలయ్యానని కారు ఖరీదు ఎక్కువ కావడంతో వెనక్కు తగ్గానని ఆమె పేర్కొన్నారు.

లోన్ తీసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఆలోచన విషయంలో వెనక్కి తగ్గానని రోహిణి తెలిపారు. ఇల్లు, కారు కొనుగోలు చేశానని ఫ్లాట్ కొనుగోలు చేసి అమ్మానాన్నల పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కోరిక ఒక్కటే మిగిలి ఉందని రోహిణి వెల్లడించారు. రోహిణి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రోహిణి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus