‘గెటప్’సీను లవ్ కు విలన్ గా సుధీర్!

ప్రముఖ ఛానెల్ ఈటీవీ, మల్లెమాల వాళ్ళు కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న షో జబర్దస్త్ కామిడీ షో. ఈ షో ఎంత పాప్యులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ షో పుణ్యమా అని టాలీవుడ్ ముందు మంచి కమీడీయన్స్ దొరకడం విశేషం. ఇదిలా ఉంటే ఈ టాలెంట్ షో లో సుడిగాలి సుధీర్ టీమ్ లో రకరకాల గెటప్స్ తో అలరిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు మన గెటప్ సీను. తాను వేసిన రకరకాల గెటప్స్ వల్ల తన పేరు సీను నుంచి గెటప్ సీనుగా మారిపోయింది. అయితే అదే క్రమంలో సీను షో లో స్కిట్ చివర్లో సుధీర్ కు విలన్ గా మారి అతన్ని చిరక బాదుతాడు. అంతవరకూ పక్కన పెడితే సీను రియల్ లైఫ్ లో సుధీర్ విలన్ అని తాజాగా సీనునే చెప్పాడు. విషయంలోకి వెళితే….ఈ మధ్య జబర్దస్థ్ కామెడీ యాక్టర్స్ తో మిగతా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిన ఈటివి యాజమాన్యం ఒక్కొక్కరికి ఒక్కో గేం షో ప్లాన్ సంగతి తెలిసిందే.

అయితే అదే క్రమంలో సుధీర్ రష్మిల జోడితో ఢీ జోడి అనే డ్యాన్స్ ప్రోగ్రాం ను స్టార్ట్ చేసింది. ఆ షో కి గతవారం గెటప్ శ్రీను తన అర్దాంగి సుజాతలను గెస్ట్ లుగా ఇన్వైట్ చేశారు. ఇక అక్కడ చెప్పాడు మన సీను తన లవ్ మ్యాటర్ గురించి, తన ప్రేమకు సుధీర్ ఎలా విలన్ గా మారాడు అన్న విషయం గురించి. ఈ విషయం గురించి మాట్లాడుతూ….సుధీర్ తమ్ముడికి స్నేహితురాలైన సుజాత తన ద్వారా శ్రీనుకి పరిచయం అయ్యిందట. అయితే మొదటి పరిచయంలోనే శ్రీను సుజాతల ప్రేమ చిగురించడంతో ఆ విషయాన్ని సుధీర్ దగ్గర దాచాడట మన సీను. అయితే అనుకోని క్రమంలో  సుధీర్ కు విషయం తెలిసే సరికి శ్రీను సుజాతల ప్రేమ ముదిరిపోయిందట. ఇక చేసేదేమి లేక ఇద్దరు ఇష్టపడితే తాను కూడా ఒకే అన్నాడట మన లీడర్ సుధీర్.  అలా తన ప్రేమ వ్యవహారాన్ని వివరించాడు మన సీను.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus