యాంకర్ పై ఫైర్ అయిన జబర్దస్త్ వినోద్…!

‘జబర్దస్త్ వినోద్’… ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ వేసి పాపులర్ అయిన వారిలో మనోడు టాప్ లో ఉంటాడు. ఎందుకంటే చూడటానికి ఈయన నిజంగానే అమ్మాయిలా ఉంటాడు. ఆ గెటప్ లలో అమ్మాయిలు సైతం అసూయపడేంత అందంగా ఉంటాడు. అయితే ఈ షో ప్రభావం ఎలా ఉన్నా.. మొదటినుండీ ఈయన వివాదాలతోనే పాపులర్ అవుతూ వచ్చాడు.

మొదట్లో ఈయన ఇంట్లో వాళ్లు ఈయనకి పెళ్ళి చేస్తాను అంటే సూసైడ్ అటెంప్ట్ చేసాడు. దీంతో ఇతను పెళ్ళి అంటే ఇష్టం లేని వ్యక్తా.. ఇతను సంసారానికి పనిచెయ్యడా అనే భయంకరమైన అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. మొన్నటికి మొన్న ఇతని పై ఇంటి యజమాని దాడి చేయడంతో మరింతగా వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా ఇతను ఓ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నిజాల్ని బయటపెట్టి క్లారిటీ ఇచ్చాడు.

మీరు నిజంగానే అబ్బాయా లేక అమ్మాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు వినోద్. “నేను మగాన్ని.. తేడాగాన్ని కాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుని అందరి నోళ్లు మూయిస్తాను.తొందరలో నా మరదలితోనే ఏడడుగులు నడవబోతున్నాను” అంటూ కాస్త ఘాటుగానే జవాబిచ్చాడు వినోద్. ఈ మధ్యే గాయాల నుండీ కోలుకున్న వినోద్.. తిరిగి జబర్దస్త్ లో బిజీ అయ్యాడు.

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus