ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సరికొత్త నిర్ణయాలతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఆ విషయం దైర్యంగా బయటికి చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ అలాగే మరి కొందరు మాత్రమే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నాచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
మిగతా స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించకపోవడం అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలు స్టార్ హీరోలందరూ కూడా భయపడుతున్నారు అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంగా మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పందించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు విషయం పై విమర్శలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..
పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే కూడా విమర్శలు చేస్తున్నారు… వాళ్లంతా పేదల వ్యతిరేకులు, పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్లకు ఆ దేవుడు జ్ఞానం ఇవ్వాలి అని కోరుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో వివరణ ఇవ్వడం విశేషం. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఒక వర్గం వారు మాత్రం తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టు కూడా సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఉంటుందని ఆ విషయంలో ప్రభుత్వాల నిర్ణయాలు అవసరం లేదని కూడా వివరణ ఇచ్చారు.
కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ రేట్లతో సినిమా థియేటర్స్ కొనసాగించలేక చాలావరకు థియేటర్స్ మూత పడిన విషయం తెలిసిందే. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!