Mahesh Babu, Jagan: జగన్ పై మహేష్ కు అభిమానమా.. సెటైరా?

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ ఆయనను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో మహేష్ బాబు ఈ సినిమాలో అదే విధంగా కనిపించడం గమనార్హం. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మహేష్ ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అటు క్లాస్ ఆడియన్స్ ఇటు మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉండటం గమనార్హం. థమన్ పాటలు ఇప్పటికే హిట్ కాగా మహేష్ ఖాతాలో ఈ సినిమాతో గ్యారంటీ హిట్ గా సర్కారు వారి పాట చేరే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ లో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపించగా కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించారు. ట్రైలర్ లో మహేష్ చెప్పిన “నేను విన్నాను.. నేను ఉన్నాను” డైలాగ్ తెగ వైరల్ అవుతోంది.

వాస్తవానికి సీఎం జగన్ 2019 ఎన్నికలకు ముందు ఈ డైలాగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు ఈ డైలాగ్ ను జగన్ పై అభిమానంతో చెప్పారా? లేక సెటైరికల్ గా చెప్పారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోతుందని ట్రైలర్ ప్రూవ్ చేసింది. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..’ డైలాగ్ ద్వారా మహేష్ బాబు సోషల్ మీడియాలో హడావిడికి కారణమయ్యారు. అమెరికాలో డబ్బును వడ్డీకి ఇచ్చే వ్యక్తి పాత్రలో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాలో మహేష్ కు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus