సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతి బాబు

శుభాకాంక్షలు, పెద్దరికం, శుభలగ్నం.. వంటి కుటుంబ కథ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు.. లెజెండ్ సినిమాతో విలన్ అవతారమెత్తారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలను చేసి క్యారక్టర్ ఆర్టిస్టుగాను మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా రంగస్థలం సినిమాలోనూ అదరగొట్టారు. ప్రస్తుతం అతను విలన్ గా నటించిన చిత్రం “సాక్ష్యం”. బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న “సాక్ష్యం” చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. ఈ పాటలు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

త్వరలోనే థియేటర్లోకి రానున్న ఈ మూవీలో తన పాత్ర గురించి జగపతిబాబు వెల్లడించారు. “ఫ్యామిలీ హీరోనైన నేను ఇటీవలి కాలంలో విలన్‌గా నటిస్తున్నాను. తాజాగా “సాక్ష్యం” సినిమాలో కూడా విలన్ రోల్ పోషించాను. ఈ సినిమాలో విలన్ చాలా క్రూరుడు. ప్రపంచంలో ఇంత కంటే నీచుడు ఉండడు. ఇప్పటివరకు నేను పోషించిన విలన్ పాత్రల్ని ప్రేక్షకులు క్షమించారు. కానీ, ఈ సారి మాత్రం క్షమించరు. వీడు చాలా పెద్ద వెధవ. అతనికి డబ్బు తప్ప మరేది ముఖ్యం కాదు” అని చెప్పారు. జగ్గూభాయ్ చెప్పిన విధానం చూస్తుంటే తన నటనతో భయపెట్టించడం ఖాయమనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus